అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyundai Verna 2026 | దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన హ్యుందాయ్ (Hyundai).. సెడాన్ వెర్నా 2026 మిడ్ సైకిల్ అప్‌డేట్‌ను సోమవారం భారత్‌లో విడుదల చేసింది. ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్‌ను అప్‌డేట్ చేసి సరికొత్త డిజైన్, అదిరిపోయే ఫీచర్లతో దీనిని తీసుకువచ్చింది.
దీని ప్రారంభ ధర రూ.10.98 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది హోండా సిటీ, వోక్స్‌వ్యాగన్ వర్చూస్ (Volkswagen Virtus), స్కోడా స్లేవియాలతో పోటీ పడబోతోంది. కొత్త డిజైన్, అధునాతన టెక్నాలజీ, శక్తిమంతమైన ఇంజిన్‌తో 2026 వెర్నా మిడ్ సైజ్ సెడాన్ మార్కెట్‌లో పోటీని మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఈ కారు గురించి తెలుసుకుందామా మరి..
డిజైన్..
- 2026 వెర్నా బయటి వైపు పలు మార్పులు చేసింది. కొత్త బ్లాక్ క్రోమ్ రేడియేటర్ గ్రిల్, రీడిజైన్ చేసిన ఫ్రంట్, రియర్ బంపర్లు కారుకు మరింత స్పోర్టీ లుక్‌ను ఇవ్వనున్నాయి.
- డ్యుయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌తో పాటు బానెట్ అంతా విస్తరించే కొత్త ఎల్ఈడీ లైట్ బార్ కూడా జోడించారు.
అదనంగా 16 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ఇచ్చారు.
Hyundai Verna 2026 | ఇంటీరియర్
- కారు లోపల జోడించిన పలు ఫీచర్లు డ్రైవర్లకు కంఫర్ట్‌ను ఇవ్వనున్నాయి.
- ఈ సెగ్మెంట్‌లో మొదటిసారి ఎలక్ట్రిక్ వాక్ ఇన్ ఫీచర్ అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా వెనక సీట్లో ఉన్న ప్రయాణికులు ముందు సీటును ఎలక్ట్రానిక్‌గా సర్దుకోవచ్చు. డ్రైవర్ కోసం మెమరీ ఫంక్షన్‌తో 8 వే పవర్ అడ్జస్టబుల్ సీటు, ‘వెల్కమ్ రిట్రాక్ట’ ఫీచర్ ఉన్నాయి.
- డ్యాష్‌బోర్డ్‌లో డ్యుయల్ 10.25 అంగుళాల డిజిటల్ స్క్రీన్‌లు ఉన్నాయి. మీడియా, క్లైమేట్ సెట్టింగ్స్ కోసం స్విచ్ చేయగల కంట్రోలర్‌ను కూడా జోడించారు.
Hyundai Verna 2026 | భద్రత ఫీచర్లు..
- భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టి అన్ని వేరియంట్లలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు ఇచ్చారు. ఇందులో సెంటర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ కూడా ఉంది.
- లెవల్ 2 ఏడీఏఎస్ టెక్నాలజీతో ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి సుమారు 20 స్మార్ట్ డ్రైవింగ్ ఫంక్షన్లున్నాయి.
- రియర్ వ్యూ మిర్రర్‌లో ఫ్యాక్టరీ ఫిట్ డాష్‌క్యామ్ కూడా ఉంది.
Hyundai Verna 2026 | వేరియంట్స్, ధరలు..
- ఆరు వేరియంట్లలో లభించే ఈ కారు.. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జత చేసిన రెండు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.
- వెర్నా ఫేస్‌లిఫ్ట్‌లో హెచ్‌ఎక్స్2 (రూ. 10.98 లక్షలు), హెచ్‌ఎక్స్4 (రూ. 12.25 లక్షలు), హెచ్‌ఎక్స్6 (రూ. 13.19- రూ. 14.40 లక్షలు), హెచ్‌ఎక్స్6 ప్లస్(రూ. 13.81- రూ. 15.02 లక్షలు), హెచ్‌ఎక్స్8 (రూ. 14.88- రూ. 17.62 లక్షలు), హెచ్‌ఎక్స్10 (రూ. 17.15- రూ. 18.25 లక్షలు) వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
- ఇది క్లాసీ బ్లూ, టైటాన్ గ్రే మాట్టే రంగుల్లో లభిస్తుంది.
ఇది కూడా చదవండి..: Tata Motors March Offers | ‘టాటా మోటార్స్ మార్చి ఆఫర్స్.. డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ కూడా..

