Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Ice Cream Ban Guduru | ఐస్‌క్రీం బండ్లకు నో చెప్పిన గ్రామం.. గూడూరు ప్రజల వినూత్న నిర్ణయంపై ప్ర‌శంస‌లు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

ఆంధ్రప్రదేశ్​ - Ice Cream Ban Guduru | ఐస్‌క్రీం బండ్లకు నో చెప్పిన గ్రామం.. గూడూరు ప్రజల వినూత్న నిర్ణయంపై ప్ర‌శంస‌లు

ఆంధ్రప్రదేశ్​

Ice Cream Ban Guduru | ఐస్‌క్రీం బండ్లకు నో చెప్పిన గ్రామం.. గూడూరు ప్రజల వినూత్న నిర్ణయంపై ప్ర‌శంస‌లు

గూడూరు గ్రామంలో ఐస్‌క్రీం బండ్లపై పూర్తి నిషేధం విధిస్తూ గ్రామస్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 20, 2026 1:13 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
7 రోజులు ago
Share
Ice Cream Ban Guduru

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ice Cream Ban Guduru | సాధారణంగా గ్రామాల సరిహద్దుల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు, శుభాకాంక్షల బ్యానర్లు కనిపించడం సహజం. అయితే గూడూరు గ్రామం (Guduru Village)లో మాత్రం పూర్తిగా భిన్నమైన హెచ్చరిక బోర్డు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Contents
  • Ice Cream Ban Guduru | నిషేధానికి కారణాలు:
    • Ice Cream Ban Guduru | కల్తీ ఆహారంపై పెరుగుతున్న అవగాహన

మా ఊరిలోకి ఐస్‌క్రీం బండ్లు రాకూడదు.. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా విధిస్తాం అని స్పష్టంగా పేర్కొంటూ గ్రామ ప్రవేశంలో బోర్డు ఏర్పాటు చేశారు.ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం పిల్లల ఆరోగ్యం. ఇటీవల గ్రామంలోకి వస్తున్న స్థానిక తయారీ ఐస్‌క్రీం బండ్ల (Ice Cream Carts) వల్ల చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నట్లు గ్రామస్థులు గుర్తించారు.

Ice Cream Ban Guduru | నిషేధానికి కారణాలు:

ఐస్‌క్రీంలలో  ఉపయోగిస్తున్న రసాయనాలు, రంగుల గురించి స్పష్టత లేకపోవడం. అలానే వీటిని తిన్న పిల్లలకు దంత సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు రావడం, లైసెన్స్ లేకుండా తయారు చేసిన ఐస్‌క్రీంలను తక్కువ ధరలకు అమ్మడం, చిన్నారులు వీటికి అలవాటు పడిపోవడం. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గ్రామ పెద్దలు, ప్రజలు కలిసి వారం రోజుల క్రితం ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గూడూరు గ్రామం ప్రజలు ఇలాంటి సామాజిక నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిన మద్యం బెల్ట్ దుకాణాన్ని కూడా గ్రామస్థులే ముందుకు వచ్చి తొలగించారు.

Ice Cream Ban Guduru | కల్తీ ఆహారంపై పెరుగుతున్న అవగాహన

ఇప్పుడు ఐస్‌క్రీం బండ్లపై నిషేధం విధించడం ద్వారా గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కొనసాగించాలని వారు భావిస్తున్నారు.ప్రభుత్వ అధికారుల తనిఖీల కోసం వేచి చూడకుండా ప్రజలే స్వయంగా ఫుడ్ సేఫ్టీ (Food Safety)పై చైతన్యంగా వ్యవహరించడం అభినందనీయమని స్థానికులు చెబుతున్నారు.ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో కల్తీ ఆహారంపై పెరుగుతున్న అవగాహనకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇతర గ్రామాలు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే, చిన్నారుల్లో అనారోగ్య సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి..: Tirumala June Quota | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. జూన్​ దర్శన కోటా షెడ్యూల్​ విడుదల

Tirumala June Quota | శ్రీవారి భక్తులకు అలెర్ట్​.. జూన్​ దర్శన కోటా షెడ్యూల్​ విడుదల
Markapuram Bus Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. బస్సులో చెలరేగిన మంటలు.. 10 మంది సజీవ దహనం..
Tirumala Forest Fire | తిరుమల కొండల్లో కార్చిచ్చు..
Markapuram Bus Accident | మార్కాపురం బస్సు ప్రమాదం.. 13కు చేరిన మృతుల సంఖ్య
AP Group 1 Case | గ్రూప్‌-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
TAGGED:Food SafetyGuduru VillageIce Cream Ban GuduruIce Cream Carts
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Family Life Insurance Scheme Family Life Insurance Scheme | రాష్ట్రంలో కొత్త పథకం.. ప్రతి కుటుంబానికి జీవితబీమా : డిప్యూటీ సీఎం
Next Article Health Awareness Nizamabad Health Awareness Nizamabad | ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?