అక్షరటుడే, వెబ్‌డెస్క్: IDFC Bank Fraud | ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు సోమవారం ఇంట్రాడేలో 20 శాతం నష్టపోయాయి. తర్వాత కోలుకుని 16 శాతం నష్టంతో ముగిశాయి. రూ. 590 కోట్ల ఫ్రాడ్ జరిగినట్లు బ్యాంకు పేర్కొంది. దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడ్డారు. షేరు ధర తగ్గడం వల్ల ఈ బ్యాంకులో వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వంతో పాటు, ఎలఐసీ భారీగా నష్టపోయాయి.
IDFC Bank Fraud | నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్
హరియాణా రాష్ట్రం చండీగఢ్‌లోని ఒక బ్రాంచ్‌లో కొందరు ఉద్యోగులు అనధికారికంగా, మోసపూరిత ట్రాన్సాక్షన్లు చేశారని ఐడీఎఫ్‌సీ బ్యాంక్ గుర్తించింది. ఈ విషయాన్ని బ్యాంక్ శనివారం రాత్రి తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. హరియాణా ప్రభుత్వ విభాగం ఒకటి ఐడీఎఫ్‌సీ బ్యాంకులో తమ ఖాతాను క్లోజ్ చేసి నిధులను బదిలీచేయాలని కోరడంతో మోసం వెలుగులోకి వచ్చింది. రూ. 590 కోట్ల మేర ఫ్రాడ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఇది హర్యానా ప్రభుత్వ లింక్ అకౌంట్లకు మాత్రమే సంబంధించినదని, ఇతర కస్టమర్లకు సంబంధం లేదు అని బ్యాంక్ పేర్కొంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. కేపీఎంజీని అపాయింట్ చేసి ఇండిపెండెంట్ ఫోరెన్సిక్ ఆడిట్ చేయిస్తున్నట్లు బ్యాంకు తెలిపింది. ఫ్రాడ్ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ డబ్బును ఇతర బ్యాంకుల్లో ఉన్న లింక్ అకౌంట్ల నుంచి రికవరీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మోసం జరిగినట్లు తెలియగానే ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో సోమవారం ఉదయం ట్రేడింగ్ మొదలైన వెంటనే ఐడీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు 20 శాతం నష్టంతో లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఒక్కరోజేలోనే రూ. 14,300 కోట్లకుపైగా తగ్గడం గమనార్హం.
IDFC Bank Fraud | కేంద్ర ప్రభుత్వానికి రూ. 900 కోట్ల నష్టం..
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులో కేంద్రం ప్రభుత్వానికి 7.75 శాతం వాటా ఉంది. 666 మిలియన్ల షేర్లు ఉన్నాయి. సోమవారం షేరు ధర 16 శాతం మేర పడిపోవడంతో ప్రభుత్వానికి రూ. 900 కోట్ల నష్టం వచ్చింది. ఈ బ్యాంకులో 2.35 శాతం వాటా కలిగిన ఎలఐసీ ఈరోజు రూ. 270 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ వంటి ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా వరుసగా రూ. 239 కోట్లు రూ. 253 కోట్లు నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Trump Tariffs Suspension | సుప్రీం కోర్టు తీర్పు ఎఫెక్ట్.. రేపటి నుంచి ట్రంప్ టారిఫ్‌లు నిలిపివేత

