Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Illegal Brick Kilns | నిబంధనలకు పాతర.. జోరుగా అక్రమ ఇటుక బట్టీలు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Illegal Brick Kilns | నిబంధనలకు పాతర.. జోరుగా అక్రమ ఇటుక బట్టీలు..

తెలంగాణ

Illegal Brick Kilns | నిబంధనలకు పాతర.. జోరుగా అక్రమ ఇటుక బట్టీలు..

నిజామాబాద్ జిల్లా భీమ్​గల్ మండలంలో ఇటుక బట్టీల దందా మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి, ఎటువంటి అనుమతులు లేకుండానే పదుల సంఖ్యలో బట్టీలు వెలుస్తున్నాయి.

admin
Last updated: ఫిబ్రవరి 25, 2026 4:18 సా.
admin
1 నెల ago
Share
Illegal Brick Kilns

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Illegal Brick Kilns | నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ మండలంలో ఇటుక బట్టీల దందా మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది. నిబంధనలకు తిలోదకాలు (Illegal Brick Kilns) ఇచ్చి, ఎటువంటి అనుమతులు లేకుండానే పదుల సంఖ్యలో బట్టీలు వెలుస్తున్నాయి. మండల కేంద్రంతో పాటు మేజర్ గ్రామ పంచాయతీలు, మారుమూల గిరిజన తండాల్లో ఈ అక్రమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికారుల కళ్లెదుటే అటవీ సంపద బుగ్గిపాలవుతున్నా, బాల్యం బట్టీల్లో మగ్గుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.

Contents
  • Illegal Brick Kilns | అనుమతులు లేవు.. అంతా అక్రమమే!
    • పట్టింపులేని అధికార యంత్రాంగం
      • అనుమతులు ఇవ్వలేదు..

Illegal Brick Kilns | అనుమతులు లేవు.. అంతా అక్రమమే!

నియమావళి ప్రకారం ఇటుక బట్టీని ఏర్పాటు చేయాలంటే రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి, భూగర్భ జల శాఖ మరియు కార్మిక శాఖ నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరి. కానీ భీంగల్‌లో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది.

రెవెన్యూ ఉల్లంఘన: సారవంతమైన వ్యవసాయ భూముల్లో యథేచ్ఛగా మట్టిని తవ్వి ఇటుకలు తయారు చేస్తున్నారు. భూమి స్వభావాన్ని మార్చకుండానే కమర్షియల్ కార్యకలాపాలు సాగిస్తున్నారు.

విద్యుత్ చౌర్యం: బట్టీల వద్ద యంత్రాల నిర్వహణకు, కార్మికుల నివాసాలకు అవసరమైన విద్యుత్‌ను అధికారిక అనుమతులు లేకుండానే వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

పర్యావరణ విధ్వంసం: ఇటుకలను కాల్చేందుకు యజమానులు అడ్డగోలుగా పెద్ద పెద్ద వృక్షాలను నరికివేస్తున్నారు. పచ్చని చెట్లను ఇంధనంగా వాడుతూ పర్యావరణానికి తీవ్ర హాని తలపెడుతున్నారు.

మగ్గుతున్న బాల్యం: బట్టీల్లో పనిచేసేందుకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికుల కుటుంబాలు ఇక్కడ బతుకు వెళ్లదీస్తున్నాయి. వీరితో పాటు చిన్నారి పిల్లలు సైతం బట్టీల పనిలో నిమగ్నమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ‘బాల కార్మిక వ్యవస్థ’ నిర్మూలన చట్టాలు ఇక్కడ కాగితాలకే పరిమితమయ్యాయి. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన వయసులో చిన్నారులు మట్టిలో మగ్గుతూ ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు.

పట్టింపులేని అధికార యంత్రాంగం

గ్రామ పంచాయతీల నుంచి ఎటువంటి నిరభ్యంతర పత్రాలు (NOC) లేకుండానే బట్టీలు నిర్వహిస్తున్నా స్థానిక యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్మిక శాఖ తనిఖీలు లేకపోవడం, రెవెన్యూ విభాగం మౌనం వహించడం బట్టీ యజమానులకు వరంగా మారింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, ప్రకృతిని నాశనం చేస్తున్న ఈ అక్రమ బట్టీలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

అనుమతులు ఇవ్వలేదు..

– షబ్బీర్, తహశీల్దార్​, భీమ్​గల్​

భీమ్​గల్ మండలంలో ఇటుక బట్టీల నిర్వహణకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. అక్రమంగా ఇటుక బట్టలు నిర్వహిస్తే తగిన చర్యలు తీసుకుంటాం. నిబంధన విరుద్ధంగా ఇటుక బట్టీలు నిర్వహించరాదు. విద్యుత్ చౌర్యం, బాల కార్మికులతో పని చేయించడం, కలపను ఇష్టారితిన తగలబెట్టడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని చటారీత్యా ఆయా ఇటుక బట్టీల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం.

ఇది కూడా చదవండి..: India Semi final Chances | జింబాబ్వే చిత్తుగా ఓడ‌డంతో ప్రమాదంలో టీమిండియా.. భారత్ సెమీస్ ఆశలు క్లిష్టం.. NRR కీలకం

Revanth Reddy Meeting | సీఎం రేవంత్​ను కలిసిన అమెరికా డెలావర్ రాష్ట్ర గవర్నర్
Revanth Reddy Warning | వారు తీరు మార్చుకోవాలి.. కలెక్టర్లపై సీఎం ఆగ్రహం
Telangana Building Rules | తెలంగాణ బిల్డింగ్ రూల్స్‌లో కీలక మార్పులు
Harish Rao Letter | రాజ్యాంగ పరిరక్షణ అంటే ఇదేనా.. రాహుల్​ గాంధీకి హరీశ్​రావు లేఖ
Maize Procurement Centers | మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి: ఎంపీ అర్వింద్ ధర్మపురి
TAGGED:BheemgalChild LabourElectricity TheftEnvironmental DamageIllegal Brick KilnsLabour DepartmentNizamabad DistrictPollution Control BoardRevenue ViolationsTahsildar Shabbir
Share This Article
Facebook Whatsapp Whatsapp
Previous Article Tirumala Laddu Controversy Tirumala Laddu Controversy | కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు..: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
Next Article Hair Wash Frequency Hair Wash Frequency | వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలో తెలుసా..!
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?