Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Illegal Mining Action | అక్రమ మైనింగ్​పై చర్యలు తీసుకోవాలి : హరీశ్​రావు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Illegal Mining Action | అక్రమ మైనింగ్​పై చర్యలు తీసుకోవాలి : హరీశ్​రావు

తెలంగాణతాజా వార్తలు

Illegal Mining Action | అక్రమ మైనింగ్​పై చర్యలు తీసుకోవాలి : హరీశ్​రావు

హైదరాబాద్​లో అనుమతులు లేకుండా మైనింగ్​ చేస్తున్న రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థపై చర్యలు తీసుకోవాలని హరీశ్​రావు డిమాండ్​ చేశారు. అసెంబ్లీలో శనివారం ఆయన మాట్లాడారు.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 3:14 సా.
Srinivas Kolluri
14 గంటలు ago
Share
Illegal Mining Action

అక్షరటుడే, వెబ్​డెస్క్: Illegal Mining Action | హైదరాబాద్ (Hyderabad) నడిబొడ్డున రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ఇల్లీగల్ మైనింగ్ చేస్తుందని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. ఆయన శనివారం అసెంబ్లీలో మాట్లాడారు.

Contents
  •  Illegal Mining Action | లేఖ రాసినా..
    •  Illegal Mining Action | పొంగులేటి సంస్థ

శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ గ్రామం సర్వే నంబర్ 62, 63లో రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (Raghava Constructions) భారీ స్టోన్ క్రషర్ డీజిల్ జనరేటర్లపై నడుపుతుందన్నారు. దానికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని పేర్కొన్నారు. 22–05–2025 నాడు రెవెన్యూ డిపార్ట్మెంట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎస్పీడీసీఎల్, మైనింగ్ శాఖ కలిసి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ క్రషర్ సంస్థను తనిఖీ చేసి, అవసరమైన డాక్యుమెంట్లను ప్రవేశపెట్టమని షోకాజ్ నోటీసులు (Show-cause Notices) ఇచ్చినట్లు గుర్తు చేశారు. కానీ సందరు సంస్థ ఎలాంటి ఆధారాలు ప్రవేశపెట్టలేదని, నోటీసులకు రిప్లై కూడా ఇవ్వలేదన్నారు.

 Illegal Mining Action | లేఖ రాసినా..

రాఘవ కన్‌స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతుందని ప్రభుత్వానికి, తెలంగాణ పొల్యూషన్ బోర్డు (Telangana Pollution Board) కు అధికారులు లేఖ రాశారని హరీశ్​రావు అన్నారు. టెక్నికల్​ టీమ్​ మార్చి 4న మరోసారి క్వారీని సందర్శించి మార్చి 13న షోకాజ్ నోటీస్ ఇచ్చిందన్నారు. సదరు సంస్థపై యాక్షన్ తీసుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు మైనింగ్ శాఖ (Department of Mining) లేఖ రాసిందన్నారు. అయినా ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు.

 Illegal Mining Action | పొంగులేటి సంస్థ

రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కుమారుడిది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్టోన్ క్రషర్​లో చిన్న తప్పు జరిగిందని ఆయన సోదరుడిని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి నెల రోజులు జైల్లో పెట్టారని హరీశ్​రావు అన్నారు. అతన్ని అరెస్ట్ చేసినప్పుడు, పొంగులేటి సంస్థ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ప్రతిపక్షానికి ఒక న్యాయం, అధికార పక్షానికి ఒక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Water Crisis | హైదరాబాద్​లో నీటి కష్టాలు.. ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ

HPV Vaccination Launch | హెచ్​పీవీ వ్యాక్సినేషన్​ ప్రారంభించిన ప్రధాని మోదీ
Nizamabad Bus Accident | రక్తమోడిన జాతీయ రహదారి.. అతివేగం – నిద్ర మత్తు కారణమా.. క్షతగాత్రులకు జీజీహెచ్​లో చికిత్స
Nizamabad Congress Leader Murder | నిజామాబాద్​ జిల్లాలో కాంగ్రెస్​ నేత దారుణ హత్య!
Hyderabad Traffic Restrictions | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. హైదరాబాద్​లో ట్రాఫిక్​ ఆంక్షలు
Chanakya Parenting Tips | బిడ్డల భవిష్యత్తుపై బెంగ వద్దు.. ఆచార్య చాణక్యుడు సూచించిన సూత్రాలు పాటిస్తే చాలు!
TAGGED:Department of MiningHyderabadIllegal Mining ActionMinister Ponguleti Srinivas ReddyRaghava ConstructionsShow Cause NoticesTelangana Pollution Board
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Kamareddy Municipal Controversy Kamareddy Municipal Controversy | బల్దియా కమిషనర్, టీపీవోలను సరెండర్ చేయాల్సిందే..: కౌన్సిలర్ల ఏకగ్రీవ తీర్మానం
Next Article Nokia Layoffs 2026 Nokia Layoffs 2026 | నోకియాలో భారీగా ఉద్యోగాల కోత! 14 వేల మందిని తొలగించే అవకాశం
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?