అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Illegal Mining Probe | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై సీబీసీఐడీ (CBCID) విచారణకు ఆదేశించారు. ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటించారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో అనుమతి లేకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ అక్రమ మైనింగ్ చేపడుతోందని మాజీ మంత్రి ఆరోపించిన విషయం తెలిసందే. ఆ కపెంనీపై చర్యలు తీసుకోవాలని ఆయన అసెంబ్లీలో డిమాండ్ చేశారు. దీనిపై స్పందిస్తూ.. ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్‌పై విచారణ చేయిస్తామన్నారు.
Illegal Mining Probe | హరీశ్‌రావు తమ్ముడి కంపెనీపై..
హరీష్ రావు తమ్ముడు మహేష్ రావు (Harish Rao Brother) అక్రమ మైనింగ్ కంపెనీపై విచారణ చేయిస్తామని సీఎం తెలిపారు. మంత్రిగా ఉండి ఆయన తన తమ్ముడికి అక్రమంగా క్వారీలు కట్టబెట్టారని ఆరోపించారు. సిరిసిల్ల ఇసుక మాఫియా చేసి దళితుల ప్రాణాలు తీసిన సంతోష్ రావు తండ్రి రవీందర్ రావుపై విచారణకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంబంధించి ఇల్లీగల్ గ్రానైట్ మైనింగ్‌పై సైతం విచారణ చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కంపెనీ అక్రమ మైనింగ్‌పై సైతం సీబీసీఐడీ విచారణ చేస్తామన్నారు.
Illegal Mining Probe | పారదర్శకంగా చర్యలు
ప్రజా ప్రభుత్వంలో పారదర్శకంగా చర్యలు ఉంటాయని సీఎం తెలిపారు. రాఘవ కన్ స్ట్రక్షన్స్ పన్నులు కట్టిందన్నారు. ఆ కంపెనీతో రాష్ట్ర ఖజానాకు ఎటువంటి నష్టం జరగలేదని తెలిపారు. మంత్రి శ్రీనివాస రెడ్డి మీద బురద చల్లాలని అక్కసుతో, వాళ్ల పైరవీలకు మంత్రి సహకరించలేదు అని బ్లాక్ మెయిల్ బీఆర్ఎస్ నాయకులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. సిరిసిల్లలో అక్రమ ఇసుక రవాణా చేసి, నేరెళ్ల ఘటనకు మాజీ ఎంపీ సంతోష్‌రావు బాధ్యులు అన్నారు. అందరిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో ఇసుక ద్వారా ఆదాయం పెరిగిందన్నారు.
Illegal Mining Probe | అన్ని ఫీజులు కట్టింది
మైనింగ్ శాఖ మంత్రి వివేక్ (Minister Vivek) మాట్లాడుతూ.. రాఘవ కన్స్ట్రక్షన్ అన్ని ఫీజులు కట్టిందన్నారు. డిసెంబర్ నాటికి పర్మిట్ ఫీజ్ రూ.1.22 కోట్లు, సినరేజ్ ఫీజ్ రూ.1.52 కోట్లు చెల్లించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతుల కోసం మైనింగ్ సంస్థలు ఎదురు చూస్తుంటాయన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ కూడా కూడా కేంద్ర అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుందని తెలిపారు.
దీనిని కూడా చదవండి : Illegal Mining Action | అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలి : హరీశ్‌రావు

