అక్షరటుడే, కోటగిరి: Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్సై సునీల్ (SI Sunil) వివరాలు వెల్లడించారు.
Illegal Sand Transport | మంజీరా పరివాహక ప్రాంతంలో..
పోతంగల్ మండలం (Pothangal Mandal) సుంకిని మంజీరా పరివాహక ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించారు. బుధవారం రాత్రి ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను దోమలేడ్గి గ్రామ శివారులో పోలీసులు పట్టుకున్నారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకుని ట్రాక్టర్ల ఓనర్లపై కేసులు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. కేవలం మన ఇసుక వాహనం యాప్ ద్వారానే ప్రజలు సైతం ఇసుకను బుక్ చేసుకోవాలని.. దళారులను నమ్మి అధిక ధరలకు ఇసుకను కొనుగోలు చేయవద్దన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు (Indiramma Houses) మాత్రం ప్రభుత్వం నిబంధనలు.. అధికారుల సూచనల మేరకు ఇసుకను తరలించాలని సూచించారు.
ఇది కూడా చదవండి..: Manik Bhandar Witchcraft | మాణిక్ బండార్‌లో క్షుద్ర పూజల కలకలం.. భయాందోళనలో గ్రామస్థులు.. సీపీకి ఫిర్యాదు!
