అక్షరటుడే, కామారెడ్డి: Illegal Sand Transport | అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీసులు సీజ్ చేశారు. మాచారెడ్డి ఎస్సై అనిల్ తెలిపిన వివరాల ప్రకారం..
Illegal Sand Transport | వాహనా తనిఖీ..
పాల్వంచ మండలం అరేపల్లి గ్రామ పరిధిలో ఆదివారం సాయంత్రం మాచారెడ్డి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో సింగరాయపల్లి గ్రామానికి చెందిన చెన్నం నారాయణరెడ్డి అనే వ్యక్తి అరేపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లో తరలిస్తున్నాడు.
Illegal Sand Transport | అనుమతి లేకుండా..
ఈ క్రమంలో పోలీసులు ట్రాక్టర్‌ను ఆపి తనిఖీ చేశారు. ఇసుకకు సంబంధించి ఎలాంటి అనుమతులు లేవు. దీంతో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. అక్రమ ఇసుక తవ్వకం, అక్రమంగా ఇసుక డంపులను ఏర్పాటు, రవాణా చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.
ఇది కూడా చదవండి: SSC Exam Rules | ఎస్ఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం.. పర్యవేక్షణ మరింత కఠినతరం!

