అక్షరటుడే, ఇందూరు: Incharge Additional Collector | నిజామాబాద్ జిల్లా (Nizamabad district news) ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్‌గా (స్థానిక సంస్థలు) (Local bodies administration) దిలీప్ కుమార్ (Dilip Kumar) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయనను నియమిస్తూ ప్రభుత్వం (District administration news) ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా అదనపు కలెక్టర్‌గా (District Additional Collector) కొనసాగిన ఐఏఎస్ అధికారి అంకిత్‌కు పదోన్నతి కల్పిస్తూ ఇటీవలే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసిన విషయం విదితమే.
Incharge Additional Collector | ఆయన స్థానంలో..
ఆయన స్థానంలో ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్‌గా నగర పాలక సంస్థ (Nizamabad Municipal Corporation) కమిషనర్ దిలీప్ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఇలా త్రిపాఠిని(Collector Ila Tripathi) మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. బాధ్యతలు స్వీకరించిన దిలీప్ కుమార్‌ను పలువురు జిల్లా అధికారులు కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి: Collector Ila Tripathi comments | ఎన్ని ఇబ్బందులెదురైనా చదువును కొనసాగించాలి..: కలెక్టర్ ఇలా త్రిపాఠి

