Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Indalwai Student | విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్.. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Indalwai Student | విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్.. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్​

నిజామాబాద్

Indalwai Student | విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కలెక్టర్ సీరియస్.. నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్​

ఇందల్వాయిలోని ఏకలవ్య పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్యపై కలెక్టర్​ సీరియస్​ అయ్యారు. నలుగురు ఉద్యోగులపై వేటు వేశారు.

Srinivas kolluri
Last updated: మార్చి 4, 2026 7:43 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Indalwai Student |

అక్షరటుడే, ఇందూరు : Indalwai Student | ఇందల్వాయిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో (Ekalavya Model Residential School) విద్యార్థి రామ్ చరణ్ (15) ఆత్మహత్య చేసుకున్న ఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణించారు. ఘటనపై ప్రాథమిక విచారణ జరిపించారు.

ప్రాంతీయ సమన్వయకర్త గంగారాం నాయక్ నేతృత్వంలో ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఏకలవ్య మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు శ్రీనివాస్ స్వామి, డాక్టర్ సైదా జైనబ్ ఫణి కుమార్, డాక్టర్ జ్యోతి ప్రాథమికంగా విచారణ జరిపి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా ఇందల్వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్ కుమార్​ను, హౌస్ మాస్టర్ కుల్దీప్ యాదవ్, హాస్టల్ వార్డెన్ విశ్వంభర్, మెస్ ఇన్చార్జి ఆకాష్ యాదవులను సస్పెండ్ (Suspend) చేస్తూ కలెక్టర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Indalwai Student | సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి

జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. ఇందల్వా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్​ను బుధవారం ఆమె సందర్శించారు. అధ్యాపకులు, విద్యార్థులతో భేటీ అయ్యారు. రామ్ చరణ్ ఆత్మహత్య సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… రామ్ చరణ్ బలవన్మరణానికి పాల్పడటం ఎంతో బాధ కలిగించిందన్నారు. ఆత్మహత్య ఆలోచనలు దరిచేరకుండా ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. తప్పుడు నిర్ణయాలతో జీవితాన్ని అంతం చేసుకోవద్దని, తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చవద్దని చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్​సీవో గంగారాం నాయక్ తదితరులున్నారు.

students

ఇది కూడా చదవండి : Eye Camp to Drivers | డ్రైవర్లకు కంటి చూపు చాలా ముఖ్యం : ఎస్పీ రాజేష్ చంద్ర

Indiramma Houses Kamareddy | నెరవేరిన సీఎం హామీ..రేపు చిన్నమల్లారెడ్డిలో రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం
Madiga Martyrs Day | మాదిగ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
Health Awareness Nizamabad | ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్ ఇలా త్రిపాఠి
ACB Raids in Kamareddy | కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ సోదాల కలకలం
Kamareddy Municipal Chairperson | సమాజ సేవలో ముందుండాలి.. కామారెడ్డి మున్సిపల్ ఛైర్​పర్సన్​
TAGGED:District Collector actionEkalavya school newsIndalvai student suicideResidential school incidentSchool staff suspensionStudent Suicide CaseTelangana Education News
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Modified Silencers Action Modified Silencers Action | మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు..: ఏఎస్పీ చైతన్య రెడ్డి
Next Article Yellareddy RDO Prabhakar Yellareddy RDO Prabhakar | ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?