Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India Car Sales Growth | కార్లకు పెరిగిన డిమాండ్.. అరకోటికి చేరువైన అమ్మకాలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - India Car Sales Growth | కార్లకు పెరిగిన డిమాండ్.. అరకోటికి చేరువైన అమ్మకాలు

బిజినెస్​తాజా వార్తలు

India Car Sales Growth | కార్లకు పెరిగిన డిమాండ్.. అరకోటికి చేరువైన అమ్మకాలు

దేశంలో కార్లకు భారీగా డిమాండ్ పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో 47 లక్షలకుపైగా కార్లు అమ్ముడయ్యాయి.

Sandeep kumar Balla_Author
Last updated: ఏప్రిల్ 2, 2026 11:28 ఉద.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 రోజు ago
Share
India Car Sales Growth

అక్షరటుడే, వెబ్​డెస్క్: India Car Sales Growth | భారత దేశంలో కోవిడ్ తర్వాత ఫోర్ వీలర్ సేల్స్ గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. దీనికి జీఎస్టీ సంస్కరణలు (GST Reforms) తోడవడంతో గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో సేల్స్ నమోదయ్యాయి. మారుతి సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి వాహన తయారీ సంస్థల రికార్డు స్థాయి పని తీరుతో 2025 -26 ఆర్థిక సంవత్సరంలో 47 లక్షలకుపైగా కార్లు అమ్ముడయ్యాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 8 శాతం ఎక్కువ. 2024-25లో పరిశ్రమ పీవీ విక్రయాలు సుమారు 43.4 లక్షలుగా ఉన్నాయి.

Contents
  • India Car Sales Growth | నంబర్‌వన్ స్థానంలో మారుతి సుజుకీ..
    • India Car Sales Growth | జోరు కొనసాగేనా?

India Car Sales Growth | నంబర్‌వన్ స్థానంలో మారుతి సుజుకీ..

యూనిట్ల అమ్మకాల పరంగా మారుతి సుజుకీ (Maruti Suzuki) నంబర్ వన్ స్థానంలో ఉంది. కంపెనీ 2025-26లో రికార్డు స్థాయిలో 24.22 లక్షల వాహనాలను విక్రయించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 22.34 లక్షల కార్లు సేల్ అయ్యాయి. టాటా మోటార్స్ (Tata Motors) 15 శాతం వార్షిక వృద్ధితో 6.4 లక్షల వాహనాలను అమ్మింది. మహీంద్రా అండ్ మహీంద్రా వాహన విక్రయాలు 20 శాతం వార్షిక వృద్ధితో 6,60,276 గా నమోదయ్యాయి.

India Car Sales Growth | జోరు కొనసాగేనా?

కేంద్ర ప్రభుత్వం (Central Government) గతేడాది ద్వితీయార్థంలో జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చింది. జీఎస్టీ 2.0 లో పన్నులు తగ్గడంతో కార్ల ధరలు సామాన్యులకూ అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రయాణికుల వాహనాల విక్రయాలు పెరిగాయి. రికార్డు స్థాయిలో 47 లక్షల ప్యాసింజర్ కార్లు అమ్ముడయ్యాయి. అయితే నూతన ఆర్థిక సంవత్సరంలో ఈ జోరు కొనసాగడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ట్రంప్ టారిఫ్‌లు, ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం కారణంగా ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు సరఫరా ఇబ్బందులు సమస్యగా మారాయి. దీంతో కంపెనీలు కార్ల ధరలను పెంచాయి. దీని ప్రభావం అమ్మకాలపై పడుతుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Stock Market Crash | షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాల్లో సూచీలు

Rajma Health Benefits | మాంసాహారానికి ప్రత్యామ్నాయం.. ప్రొటీన్‌కు రారాజు రాజ్మా
Soap Scrap Uses | సబ్బు చిన్న ముక్కలు పారేస్తున్నారా.. వీటి లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
Telangana Rain Alert | తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
Kabandha Hasthalu | కబంధ హస్తాలు అనే పదం ఎక్కడిది.. దీని వెనుక అసలు ఏమిటి?
Shiv Pratap Shukla Governor | గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం
TAGGED:Central GovernmentGST ReformsIndia Car Sales GrowthMaruti SuzukiTata Motors
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Ola Electric Sales Growth Ola Electric Sales Growth | ఓలా.. అమ్మకాలు భళా!
Next Article Delhi CCTV Removal Delhi CCTV Removal | ఢిల్లీలో భారీగా సీసీ కెమెరాల తొలగింపు
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?