అక్షరటుడే, వెబ్‌డెస్క్: India Energy Security | భారత ఇంధన భద్రత, నౌకల సురక్షపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఇటీవలి కాలంలో మూడు దశల్లో ఇరాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారతదేశానికి వస్తున్న నౌకల రక్షణ, దేశ ఇంధన అవసరాలు ఎలా కాపాడాలనేది అంశాలుగా చర్చించినట్లుగా సమాచారం.
India Energy Security | అంతకుమించి వివరాలు చెప్పడం సరికాదు..
గత కొన్నిరోజుల్లో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్.. ఇరాన్ విదేశాంగ మంత్రితో మూడు సార్లు సంభాషించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రన్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. ‘‘సురక్షితమైన షిప్పింగ్, భారత ఇంధన భద్రతకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది.. అంతకు మించి ఏ వివరాలు చెప్పడానికి ఇది సమయం కాదు” అని ఆయన పేర్కొన్నారు.
#WATCH | Delhi | MEA spokesperson Randhir Jaiswal says, “External Affairs Minister Dr S Jaishankar and Foreign Minister of Iran have had three conversations in the recent days. The last one discussed issues pertaining to the safety of shipping and India’s energy security. Beyond… pic.twitter.com/xkwCJ1nq1U
— ANI (@ANI) March 12, 2026
India Energy Security | తిరిగి రావాలనుకుంటున్న వారికి సహాయం
ఇరాన్‌లోని పరిస్థితుల నేపథ్యం స్వదేశానికి తిరిగి రావాలనుకునే భారతీయులకు విదేశాంగ శాఖ పూర్తి సహాయం అందిస్తోందని రన్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. అక్కడ ప్రస్తుతం సుమారు 9,000 మంది భారతీయులు ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిలో విద్యార్థులు, సముద్రయాన సిబ్బంది, వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు, యాత్రికులు ఉన్నారని తెలిపారు. వీరిలో అనేక మంది విద్యార్థులు ఇప్పటికే సురక్షితంగా దేశానికి చేరుకున్నారని వివరించారు. టెహ్రాన్‌లో ఉన్న మరికొంతమంది విద్యార్థులు, తీర్థయాత్రికులను దేశంలోని ఇతర సురక్షిత నగరాలకు తరలించామని చెప్పారు. అజర్బైజాన్, అర్మేనియా ద్వారా వాణిజ్య విమానాలు ఎక్కి స్వదేశం చేరుకోవాలనుకునే వారికి వీసా సంబంధిత సహాయం అందిస్తున్నామని వెల్లడించారు.
#WATCH | Delhi | MEA spokesperson Randhir Jaiswal says, “…We are also assisting Indian nationals who wish to travel to Azerbaijan and Armenia and from there to take commercial flights to return home. We are assisting them with visas. We are also assisting them with land border… pic.twitter.com/aMp07QSiQu
— ANI (@ANI) March 12, 2026
India Energy Security | పొరుగు దేశాలకు డీజిల్ సరఫరా
బంగ్లాదేశ్ డీజిల్ సరఫరా కోసం అభ్యర్థన చేసిందని రన్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. శ్రీలంక, మాల్దీవులు వంటి పొరుగు దేశాల నుంచి కూడా అభ్యర్థనలు వచ్చాయని పేర్కొన్నారు. భారతదేశం రిఫైన్డ్ పెట్రోలియం ఉత్పత్తులలో ప్రముఖ ఎగుమతిదారు అని.. దేశీయ అవసరాలు తీర్చిన తర్వాత మిగిలిన సామర్థ్యం, రిఫైనింగ్ సామర్థ్యం, లభ్యతను పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటామని జైస్వాల్ వివరించారు.
ఇది కూడా చదవండి..: Hormuz Strait India | భారత్‌కు ఊరట.. ‘హార్ముజ్’ ద్వారా రవాణాకు అనుమతి

