Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India Oil Reserves | యుద్ధం కొనసాగితే ‘బండి’ నడిచేనా?.. భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలున్నాయంటే..?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - India Oil Reserves | యుద్ధం కొనసాగితే ‘బండి’ నడిచేనా?.. భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలున్నాయంటే..?

అంతర్జాతీయంతాజా వార్తలు

India Oil Reserves | యుద్ధం కొనసాగితే ‘బండి’ నడిచేనా?.. భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలున్నాయంటే..?

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు సరఫరా పూర్తిగా నిలిచిపోతే పరిస్థితి ఏమిటన్న సందేహం సామాన్యులను పీడిస్తోంది.

Srinivas kolluri
Last updated: మార్చి 2, 2026 2:06 సా.
Srinivas Kolluri
4 వారాలు ago
Share
India Oil Reserves

అక్షరటుడే, వెబ్​డెస్క్: India Oil Reserves | అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఘర్షణ మధ్యప్రాచ్యాన్ని ఉద్రిక్తతల్లోకి నెట్టింది. యూఎస్, ఇజ్రాయిల్ కలిసి చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ (Khamenei) మరణం తర్వాత ఆందోళనలు తాsస్థాయికి చేరాయి.

Contents
  • India Oil Reserves | సగానికిపైగా హార్ముజ్ జలసంధి ద్వారానే..
      • India Oil Reserves | రెండున్నర నెలలకు సరిపడా..

ఇరాన్ గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తుండడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన “హార్ముజ్ జలసంధి”ని ఇరాన్ మూసివేయడంతో చమురుతోపాటు సరుకుల రవాణా స్థంభించాయి. దీంతో క్రూడ్ ఆయిల్ (Crude Oil) ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు యుద్ధం మరో నాలుగైదు వారాలపాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) పేర్కొన్నారు.

India Oil Reserves | సగానికిపైగా హార్ముజ్ జలసంధి ద్వారానే..

మన దేశం ముడి చమురు కోసం 85 శాతానికిపైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. హార్ముజ్ జలసంధి ద్వారానే యాభై శాతానికిపైగా చమురు దిగుమతి అవుతోంది. ఈ నేపథ్యంలో ముడిచమురు సరఫరా నిలిచిపోతే పరిస్థితి ఏమిటన్న సందేహాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి మన దేశం సిద్ధంగా ఉంది. ఇప్పటికే వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను భారీగా పెంచింది.

India Oil Reserves
India Oil Reserves

India Oil Reserves | రెండున్నర నెలలకు సరిపడా..

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం మన దేశంలో 74 రోజుల వినియోగానికి సరిపడా ముడి చమురు నిల్వలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చాలా అభివృద్ధి చెందిన దేశాలు 90 రోజుల నిల్వను లక్ష్యంగా పెట్టుకుంటాయని, భారత్ కూడా త్వరలోనే ఈ లక్ష్యాన్ని చేరుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన దేశం వ్యూహాత్మక నిల్వలను తొలి దశలో 3 ప్రధాన ప్రాంతాలలో ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో భూగర్భ గుహల్లో ముడి చమురును భద్రపరుస్తున్నారు. అలాగే కర్ణాటక రాష్ట్రం మంగళూరు పశ్చిమ తీరంలో, అదే రాష్ట్రంలోని పాడూరులో నిల్వ కేంద్రాలున్నాయి. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి మూతపడినా రష్యన్ ఆయిల్ భారత్‌కు అందుబాటులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనితోడు వెనిజులా ఆయిల్ కూడా భారత్ కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం కొనసాగినా ఇప్పటికప్పుడు భారత్‌కు వచ్చే ఇబ్బందులు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇది కూడా చదవండి..: Iran Dubai Doha Attacks | దుబాయ్, దోహాలపై ఇరాన్ దాడులు.. ఆందోళనకరంగా పరిస్థితి

March 16 Pre Market Analysis | లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ.. గ్యాప్ అప్​లో ప్రారంభం కానున్న నిఫ్టీ, సెన్సెక్స్
Feb 27 Horoscope | వైవాహిక జీవితం ఎంతో మధురం.. నేడు ఈ రాశుల వారికి మరిచిపోలేని రోజు!
Anirudh Hyderabad Concert | అనిరుధ్ సంగీత సందడి.. ఘనంగా ‘రాక్‌స్టార్ అనిరుధ్ XV’ కచేరీ
ATC Student Scholarship | ప్రభుత్వం గుడ్​న్యూస్​.. వారికి నెలకు రూ.2 వేల స్కాలర్​షిప్​
March 05 Panchangam | నేటి పంచాంగం – రాశి ఫలాలు
TAGGED:Crude oil supply IndiaEnergy strategy IndiaIndia fuel stockIndia oil reservesMiddle East tensionsOil security IndiaPetro reserves updateStrategic petroleum storageUS President Trump
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Bandi Sanjay Support Bandi Sanjay Support | అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం: కేంద్ర మంత్రి బండి సంజయ్​
Next Article Gold Price Rise Gold Price Rise | పసిడి ధరకు రెక్కలు..: రూ.1.70 లక్షలకు చేరిన బంగారం ధర
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?