అక్షరటుడే, వెబ్‌డెస్క్: India Semi final Chances | టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup 2026) సూపర్–8 దశలో గ్రూప్–1 పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది. వెస్టిండీస్ జట్టు 254/6 భారీ స్కోరు నమోదు చేసి జింబాబ్వేపై 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ ఫలితంతో భారత్ సెమీఫైనల్ అవకాశాలు కఠినంగా మారాయి. గత రాత్రి జరిగిన సూపర్ 8 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 254/6 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్‌మైయర్ 34 బంతుల్లో 85 పరుగులతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కెప్టెన్ రోవ్‌మన్ పౌవెల్ (Captain Rowman Powell) అర్థశతకంతో జట్టుకు బలమైన పునాది వేశాడు. బదులుగా జింబాబ్వే జట్టు వరుసగా వికెట్లు కోల్పోతూ లక్ష్యానికి చాలా దూరంగా నిలిచింది. గుడాకేశ్ మోటి 4 వికెట్లు తీసి ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను కూల్చేశాడు.
India Semi final Chances | భారత్ పరిస్థితి ఏంటి?
ఇప్పటికే సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలైన టీమిండియా (Team India)కు, వెస్టిండీస్ భారీ విజయం నెట్ రన్ రేట్ (NRR) పరంగా పెద్ద దెబ్బగా మారింది. ఇకపై భారత్ మిగిలిన మ్యాచ్‌లను భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్ తదుపరి మ్యాచ్ జింబాబ్వే (Zimbabwe)తో చెన్నైలో ఫిబ్రవరి 26న ఆడనుంది. అదే రోజు అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా–వెస్టిండీస్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ మ్యాచ్ ఫలితం భారత్ సెమీఫైనల్ భవితవ్యాన్ని ప్రభావితం చేయనుంది.
భారత్ సెమీఫైనల్ సమీకరణాలు :
1) భారత్ రెండు మ్యాచ్‌లూ గెలిస్తే
భారత్‌కు మొత్తం 4 పాయింట్లు.
దక్షిణాఫ్రికా అన్ని మ్యాచ్‌లు గెలిస్తే – దక్షిణాఫ్రికా, భారత్ సెమీస్‌కు.
దక్షిణాఫ్రికా వెస్టిండీస్‌పై ఓడితే – మూడు జట్లకు 4 పాయింట్లు; NRR ఆధారంగా నిర్ణయం.
దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌లూ ఓడితే – భారత్, వెస్టిండీస్ అర్హత.
2) భారత్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిస్తే
తప్పనిసరిగా వెస్టిండీస్‌పై గెలవాలి.
పాయింట్ల సమీకరణంలో మూడు జట్లు సమంగా ఉంటే NRR కీలకం.
దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌లూ ఓడినా, భారత్ ఒకటే గెలిస్తే అర్హత కష్టమే.
గ్రూప్–1 మిగిలిన మ్యాచ్‌లు
ఫిబ్రవరి 26: దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్ – అహ్మదాబాద్
ఫిబ్రవరి 26: భారత్ vs జింబాబ్వే – చెన్నై
మార్చి 1: దక్షిణాఫ్రికా vs జింబాబ్వే – ఢిల్లీ
మార్చి 1: భారత్ vs వెస్టిండీస్ – కోల్‌కతా
సెమీఫైనల్ రేసులో నిలవాలంటే భారత్ భారీ విజయాలతో పాటు ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంది. ఇక గ్రూప్–1 పోరు చివరి వరకు ఉత్కంఠ రేపనుంది.
ఇది కూడా చదవండి..: India Semifinal Chances | భారత్ సెమీస్ చేరాలంటే.. మనం గెలవడంతో పాటు సౌతాఫ్రికా ఓడిపోవద్దు..!

