అక్షరటుడే, వెబ్‌డెస్క్: India Semifinal Chances | టీ20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీ ఫైనల్ అవకాశాలు సన్నగిల్లాయి. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి చెందింది. దీంతో ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా సెమీస్‌కు చేరాలంటే మిగతా మ్యాచ్‌లు గెలవడంతో పాటు సౌతాఫ్రికా మిగతా మ్యాచ్‌లు ఓడిపోకుండా ఉండాలి.
India Semifinal Chances | సౌతాఫ్రికా చేతిలో ఓటమి..
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ సూపర్ 8 పోరులో భారత జట్టు దారుణ ఓటమిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. పోటాపోటీగా సాగుతుందనుకున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో టటీమిండియాకు ఘోర పరాభవం మిగిలింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా తొలుత 187 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 111 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ సెమీస్ చేరాలంటే సౌతాఫ్రికా మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
India Semifinal Chances | పడిపోయిన రన్‌రేట్..
సౌతాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోవడంతో నెట్ రన్‌రేట్ దారుణంగా పడిపోయింది. సూపర్ 8లో భారత్ రన్‌రేట్‌ను ఒకసారి పరిశీలిస్తే – 3.80కి పడిపోయింది. సౌతాఫ్రికా గెలుపొందడంతో 3.8 నెట్‌రన్ రేట్ సొంతం చేసుకుంది. ఈ విజయంతో సౌతాఫ్రికా జట్టుకు సెమీస్‌కి లైన్ క్లియర్ అయిందని చెప్పవచ్చు. జింబాబ్వే, వెస్టిండీస్‌లతో ఒక్క మ్యాచ్‌లో గెలిచినా కూడా సెమీస్ బెర్త్ ఖాయం అవుతుంది. అయితే భారత్ సెమీఫైనల్‌కి వెళ్లాలంటే మాత్రం సౌతాఫ్రికా జింబాబ్వే, వెస్టిండీస్‌పై గెలవాల్సి ఉంటుంది. అప్పుడు సౌతాఫ్రికా 6 పాయింట్లు సాధిస్తుంది. అదే సమయంలో భారత్ మిగతా రెండు మ్యాచ్‌లు గెలుపొందితే 4 పాయింట్లు వస్తాయి. అప్పుడు రెండు జట్లు సెమీస్‌లో అడుగుపెడుతాయి.
ఇది కూడా చదవండి..: IDFC Bank Fraud | రూ. 590 కోట్ల మోసం.. రూ. 900 కోట్ల నష్టం

