Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India T20 Final | ఫైనల్​లో దంచికొట్టిన భారత్​.. కివీస్​ లక్ష్యం 256
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - India T20 Final | ఫైనల్​లో దంచికొట్టిన భారత్​.. కివీస్​ లక్ష్యం 256

క్రీడలు

India T20 Final | ఫైనల్​లో దంచికొట్టిన భారత్​.. కివీస్​ లక్ష్యం 256

టీ 20 ప్రపంచ కప్​ ఫైనల్​ మ్యాచ్​లో భారత బ్యాటర్లు చెలరేగి ఆడారు. న్యూజిలాండ్​ ముందు 256 పరుగుల భారీ లక్ష్యం ఉంచారు.

Srinivas kolluri
Last updated: మార్చి 8, 2026 8:45 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
India T20 Final

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India T20 Final | టీ 20 ప్రపంచ కప్​ ఫైనల్​ మ్యాచ్​లో భారత బ్యాటర్లు రెచ్చిపోయారు. టాస్​ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ (New Zealand)​ బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలి రెండు ఓవర్లు ఆచితూచి ఆడిన ఓపెనర్లు సంజు శాంసన్​, అభిషేక్​ శర్మ.. ఆ తర్వాత వీర విహారం చేశారు.

Contents
  • India T20 Final | ఇషాన్​ హాఫ్ సెంచరీ
    • India T20 Final | ఒకే ఓవర్లో మూడు వికెట్లు

భారత ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ప్రతి బాల్​ను బౌండరీకి తరలించాలనే కసితో ఆడారు. దీంతో పరుగుల వరద పారింది. వరల్డ్​ కప్​లో విఫలం అవుతూ వస్తున్న ఓపెనర్​ అభిషేక్​ శర్మ (Abhishek Sharma) తుది పోరులో సత్తా చాటాడు. 21 బంతుల్లో 52 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, 3 సిక్స్​లు ఉన్నాయి. గత మూడు మ్యాచ్​ల నుంచి కీలకంగా మారిన సంజు శాంసన్ మరోసారి సత్తా చాటాడు. ఓపెనర్లు చెలరేగడంతో భారత్ పవర్​ ప్లేలో 92 పరుగులు చేసింది.

India T20 Final | ఇషాన్​ హాఫ్ సెంచరీ

అభిషేక్​ శర్మ ఔట్ అయిన తర్వాత క్రీజ్​లోకి వచ్చిన ఇషాన్​ కిషన్​ సైతం చెలరేగి ఆడాడు. శాంసన్​తో పాటు స్కోర్​ బోర్డు పరుగులు పెట్టించారు. ఇషాన్​ 25 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 4 సిక్స్​లు ఉన్నాయి.

India T20 Final | ఒకే ఓవర్లో మూడు వికెట్లు

న్యూజిలాండ్​ బౌలర్​ నీషమ్​ 16వ ఓవర్​లో మూడు వికెట్లు తీశాడు. సెంచరీకి చేరువైన శాంసన్​ (89)ను, ఇషాన్​ కిషన్​ను ఔట్​ చేశాడు. అనంతరం కెప్టెన్​ సూర్యకుమార్ యాదవ్ సైతం అదే ఓవర్​లో తొలి బంతికే క్యాచ్​ అవుట్ అయ్యాడు. నీషమ్​ 16 వ ఓవర్లో మూడు వికెట్లు తీసి ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. దీంతో స్కోర్​ వేగం నెమ్మదించింది. హర్దిక్​ పాండ్య 13 బంతుల్లో 18 పరుగులు చేసి క్యాచ్​ అవుట్ అయ్యాడు. శాంసన్​, ఇషాన్​ అవుట్​ అయ్యాక పరుగులు తగ్గాయి. చివరి ఓవర్లో దూబే 24 పరుగులు చేశాడు. అందులో మూడు ఫోర్లు, రెండు సిక్స్​లు ఉన్నాయి. దీంతో భారత్ 20 ఓవర్లలో 255 పరుగులు చేసింది.

ఇది కూడా చదవండి : T20 World Cup Final | టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న న్యూజిలాండ్​

Narendra Modi Stadium Water Price | దొరికిన కాడికి దోపిడి.. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో నీళ్ల బాటిల్‌ రూ.200.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు వచ్చిన అభిమానులకు చుక్కలు
T20 World Cup 2026 | టీ20 ప్రపంచకప్ 2026పై యుద్ధ ప్రభావం.. జట్ల భద్రతపై ఐసీసీ అప్రమత్తం
IPL 2026 Opening Match | చిన్నస్వామిలో ఐపీఎల్ మహాసంగ్రామం.. బెంగళూరు–హైదరాబాద్ పోరుకు రంగం సిద్ధం!
T20 World Cup | సెమీస్ ఆశలు పదిలం.. జింబాబ్వేపై భారత జట్టు విజయభేరి
IPL 2026 schedule | ఐపీఎల్​ పూర్తి షెడ్యూల్‌ విడుదల
TAGGED:abhishek sharma inningsindia t20 finalIndia vs New Zealand Finalishan kishan half centurynew zealand vs indiasanju samson battingT20 World Cup Final
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Krishna River Water Krishna River Water | చుక్క నీరు కూడా వదులుకోం : మంత్రి ఉత్తమ్​
Next Article India T20 Cup Victory India T20 world Cup Victory | భారత్​ థ్రిల్లింగ్​ విక్టరీ.. టీ20 వరల్డ్​ కప్​ కైవసం
2 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?