అక్షరటుడే, వెబ్‌డెస్క్: India T20 world Cup Victory టీ20 ఫైనల్స్‌లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అహ్మదాబాద్‌లో జరిగిన భారత్ – న్యూజిల్యాండ్ మ్యాచ్‌లో టీమిండియా గెలుపొందింది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు తొలుత ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత బ్యాటర్లు చెలరేగి ఆడారు.
India T20 world Cup Victory | భారీ టార్గెట్
ఓపెనర్లు అభిషేక్ శర్మ (52), సంజు శాంసన్ (89) పరుగులతో చెలరేగి ఆడారు. భారత జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఇషాన్ కిషన్ 54 పరుగులు చేశారు. భారత జట్టు మొత్తం 5 వికెట్లు కోల్పోయి 255 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ బౌలర్లు నీషమ్ (3), రచిన్ రవీంద్ర (1), హెన్రీ(1) ఒక వికెట్లు పడగొట్టారు. కాగా.. సంజు శాంసన్ 44 బంతుల్లో 89 పరుగులతో మరోసారి మెరిశారు. అలాగే గత మూడు మ్యాచుల్లో విఫలమైన అభిషేక్ శర్మ ఫైనల్స్‌లో సత్తా చాటారు. 21 బంతుల్లో 52 రన్స్ చేసి శుభారంభం ఇచ్చారు.
India T20 world Cup Victory | చతికిల పడిన న్యూజిలాండ్ జట్టు
భారీ లక్ష్యాన్ని సాధించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అక్సర్ పటేల్ బౌలింగ్‌లో ఫిన్ అలెన్ ఔట్ కావడంతో కివీస్ జట్టు పతనం మొదలైంది. అక్సర్ పటేల్ మూడు వికెట్లు తీసి న్యూజిలాండ్ జట్టు వెన్నువిరిచాడు. అలాగే బుమ్రా నాలుగు కీలక వికెట్లు తీసి భారత్ విజయంలో భాగం అయ్యారు. అనంతరం వరుస వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను భారత్‌కు సమర్పించుకుంది. దీంతో భారత్ ఘన విజయం సాధించింది. భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది.
ఇది కూడా చదవండి..: India T20 Final | ఫైనల్‌లో దంచికొట్టిన భారత్.. కివీస్ లక్ష్యం 256

