Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India vs England Semi | ఉత్కంఠభరిత పోరులో భారత్​ విజయం.. చివరి వరకు పోరాడి ఓడిన ఇంగ్లండ్​.. 8న న్యూజిలాండ్​తో తుదిపోరు!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - India vs England Semi | ఉత్కంఠభరిత పోరులో భారత్​ విజయం.. చివరి వరకు పోరాడి ఓడిన ఇంగ్లండ్​.. 8న న్యూజిలాండ్​తో తుదిపోరు!

క్రీడలుతాజా వార్తలు

India vs England Semi | ఉత్కంఠభరిత పోరులో భారత్​ విజయం.. చివరి వరకు పోరాడి ఓడిన ఇంగ్లండ్​.. 8న న్యూజిలాండ్​తో తుదిపోరు!

Naresh chandan
Last updated: మార్చి 5, 2026 11:08 సా.
Naresh chandan
3 వారాలు ago
Share
India vs England Semi | భారత్​ ఘన విజయం.. 8న న్యూజిలాండ్​తో తుదిపోరు!
India vs England Semi | భారత్​ ఘన విజయం.. 8న న్యూజిలాండ్​తో తుదిపోరు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: India vs England Semi | టీ20 వరల్డ్‌కప్ 2026 సెమీఫైనల్‌లో టీమ్ ఇండియా విజయం సాధించింది. చివరి ఓవర్​ వరకు ఉత్కంఠంగా సాగిన పోరులో ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో భారత్​ ఓడించింది. న్యూజిలాండ్‌తో జరిగే T20 ప్రపంచ కప్ ఫైనల్‌కు సిద్ధమైంది.

Contents
  • India vs England Semi | సంజూ అద్భుత ఇన్నింగ్స్
    • రషీద్ అరుదైన చెత్త రికార్డు
      • India vs England Semi | భారీ లక్ష్యం
      • India vs England Semi | నాలుగో సారి ఫైనల్​కు..

ముంబయిలోని Wankhede Stadium స్టేడియంలో  ఇంగ్లండ్​ జట్టుతో జరిగిన సెమి ఫైనల్​లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసి ఇంగ్లండ్​కు భారీ లక్ష్యానికి నిర్దేశించింది.

India vs England Semi | సంజూ అద్భుత ఇన్నింగ్స్

ఇంగ్లండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్​ ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. ఓపెనర్​ అభిషేక్ శర్మ (9 రాణించలేక ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (11 ) పెద్దగా ప్రభావం చూపలేక పోయాడు. తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ (89) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఇషాన్ కిషన్ (39) విలువైన ఇన్నింగ్స్ ఆడగా, మధ్యవరుసలో శివమ్ దూబే (43) జత కలిశాడు. తిలక్ వర్మ (21) సహకరించాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (27) వేగంగా ఆడి జట్టు పరుగులను 250 దాటించాడు.

రషీద్ అరుదైన చెత్త రికార్డు

ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అరుదైన చెత్త రికార్డు నమోదు చేశాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 200 కంటే ఎక్కువ సిక్సర్లు సమర్పించుకున్న మొదటి బౌలర్‌గా నిలిచాడు. భారత బ్యాటర్లు వరుసపెట్టి సిక్సర్లు బాదడంతో రషీద్ తాజా చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు.

akshara match

India vs England Semi | భారీ లక్ష్యం

ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ ఖాన్, విల్ జాక్స్ చెరో రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆడిల్ రషీద్ ఒక వికెట్ తీసుకున్నాడు. కానీ భారత బ్యాటర్ల దూకుడును నియంత్రించలేకపోయారు.

ఇక 254 పరుగుల భారీ లక్ష్య ఛేదన కోసం తదుపరి బ్యాటింగ్​ చేపట్టిన ఇంగ్లండ్ జట్టు బ్యాటర్లు గట్టి పోటీ ఇచ్చారు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు.

ఇక డేంజర్​ ప్లేయర్​గా పేరొందిన ఫిల్ సాల్ట్ 5 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. హార్దిక్ బౌలింగ్​లో అక్షర్ పటేల్​కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 13 పరుగులకే ఇంగ్లాండ్ తొలి వికెట్ పోగొట్టుకుంది.

ఇక తర్వాత వచ్చిన బ్యాటర్లు మాత్రం రాణించారు. జాకబ్ బెథెల్ 45 బంతుల్లో సెంచరీ చేసి, తీరుగులేని అద్భుతమైన ఆటతీరు కనబర్చాడు. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఓవర్​లో జాకబ్ బెథెల్ రనౌట్ అయ్యాడు. దీంతో అద్భుతమైన ఇన్నింగ్స్ ముగిసింది.

105 పరుగులు చేసి బెథెల్ చివరి ఓవర్​లో ఔట్​ కావడంతో ఫైనల్‌కు చేరుకోవాలనే ఇంగ్లాండ్ ఆశలు ముగిసిపోయాయి. జాకబ్ వికెట్​ తీసి, హార్దిండ్​ పాండ్యా ఇన్నింగ్​ను తిరిగి భారత జట్టు చేతిలోకి తెచ్చాడు. దీంతో గెలుపు సాధ్యమైంది.

India vs England Semi | నాలుగో సారి ఫైనల్​కు..

ఇక మార్చి 8వ తేదీన జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపడనుంది. తాజా గెలుపుతో టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌కు భారత జట్టు నాలుగోసారి చేరుకుంది.

March 08 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం
LPG Supply Monitoring | ఎల్​పీజీ కృత్రిమ కొరత.. సర్కారు కీలక నిర్ణయం.. ఇక పర్యవేక్షణ కట్టుదిట్టం!
Amanagallu Incident | అగ్నిగుండంలో పడిపోయిన భక్తులు.. పలువురికి తీవ్రగాయాలు
Tehran Oil Depot Fire | టెహ్రాన్​లోని Shehran Oil Depotలో భారీ పేలుళ్లు.. ఆకాశాన్ని తాకిన అగ్ని జ్వాలలు
Israel Iran Attacks | ఇరాన్​పై ఇజ్రాయెల్ దాడులు..
Share This Article
Facebook Whatsapp Whatsapp
Naresh chandan
ByNaresh chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Sukhoi Fighter Jet Sukhoi Fighter Jet | అసోంలో సుఖోయ్‌ యుద్ధ విమానం గల్లంతు.. ఎయిర్‌ఫోర్స్‌ ముమ్మర గాలింపు
Next Article Vijay Trisha Together | వివాహ వేడుకకు కలిసి హాజరైన టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష కృష్ణన్.. నెట్టింట వైరల్​! Vijay Trisha Together | వివాహ వేడుకకు కలిసి హాజరైన టీవీకే అధినేత విజయ్, సినీ నటి త్రిష కృష్ణన్.. నెట్టింట వైరల్​!
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?