Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: India War Challenges | యుద్ధంతో భారత్​కు సవాళ్లు.. గ్యాస్​, పెట్రోల్​పై మోదీ కీలక ప్రకటన
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - India War Challenges | యుద్ధంతో భారత్​కు సవాళ్లు.. గ్యాస్​, పెట్రోల్​పై మోదీ కీలక ప్రకటన

జాతీయం

India War Challenges | యుద్ధంతో భారత్​కు సవాళ్లు.. గ్యాస్​, పెట్రోల్​పై మోదీ కీలక ప్రకటన

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ పార్లమెంట్​లో ప్రకటన చేశారు. ఈ యుద్ధం ప్రభావం భారత్​పై తీవ్రంగా ఉంటుందన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 23, 2026 3:13 సా.
Srinivas Kolluri
4 రోజులు ago
Share
India War Challenges

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India War Challenges | పశ్చిమాసియాలో యుద్ధం భారత్​కు సవాళ్లు తీసుకొచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. సోమవారం ఆయన లోక్​సభలో ప్రసంగించారు. గ్యాస్​, పెట్రోల్​, డీజిల్​ దిగుమతులపై ప్రకటన చేశారు.

Contents
  •  India War Challenges | కొరత లేకుండా చర్యలు
    •  India War Challenges | ఆర్థిక మాంద్యం ముప్పు
      •  India War Challenges | యుద్ధం ఆపాలి

పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మోదీ అన్నారు. ప్రపంచం మీద యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉందని చెప్పారు. గల్ఫ్ దేశాల్లో కోటి మంది భారతీయులు (Indians) ఉన్నారని తెలిపారు. యుద్ధంలో చిక్కుకున్న భారత పౌరులను రక్షించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఇప్పటి వరకు 3.75 లక్షల మందిని సురక్షితంగా భారత్‌కు తరలించామన్నారు. ఇరాన్‌ నుంచి 1000 మందిని తీసుకొచ్చినట్లు చెప్పారు.

 India War Challenges | కొరత లేకుండా చర్యలు

ప్రజలకు పెట్రోల్‌, గ్యాస్ కొరత లేకుండా చర్యలు చేపట్టినట్లు ప్రధాని తెలిపారు. 60 శాతం LPGని భారత్‌లో ఉత్పత్తి చేస్తున్నామన్నారు. 41 దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 53 లక్షల మెట్రిక్‌ టన్నుల పెట్రోల్ నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. రైల్వేల విద్యుదీకరణతో 180 కోట్ల డీజిల్‌ ఆదా చేశామన్నారు. హార్మూజ్‌ జలసంధి నుంచి మన నౌకలు సురక్షితంగా వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.

 India War Challenges | ఆర్థిక మాంద్యం ముప్పు

ప్రపంచానికి ఆర్థికమాంద్యం ముప్పు పొంచి ఉందని మోదీ అన్నారు. భారత్​పై దాని ప్రభావం లేకుండా చూస్తున్నామని చెప్పారు. ఎలాంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.ఖరీఫ్ సీజన్‌లో రైతులకు డీజిల్ కొరత (Diesel Shortage) లేకుండా చూస్తామని తెలిపారు. పవర్‌ప్లాంట్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు.

 India War Challenges | యుద్ధం ఆపాలి

యుద్ధ ప్రభావం చాలా కాలం పాటు ఉంటుందని మోదీ అన్నారు. సిద్ధంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ యుద్ధాని ఆపాలని కోరారు. ఈ యుద్ధం మానవాళి ప్రయోజనాలకు మంచిది కాదన్నారు. యుద్ధాన్ని శాంతియుతంగా ముగించాలని భారత్ అన్ని పక్షాలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. పశ్చిమ ఆసియా నాయకులందరితో మాట్లాడినట్లు తెలిపారు. ఈ యుద్ధాన్ని ముగించాలని విజ్ఞప్తి చేశామన్నారు.

ఇది కూడా చదవండి..: LPG Ship India | గ్యాస్​ కష్టాలకు చెక్​… భారత్‌కు చేరిన మరో ఎల్పీజీ నౌక

Indians Killed in Iran Attacks | ఇరాన్‌ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి
BJP Rajya Sabha Candidates | రాజ్యసభ ఎన్నికలకు 9 మంది బీజేపీ అభ్యర్థుల ప్రకటన.. బీహార్ నుంచి బరిలో నితిన్ నబిన్..
Ananda Bose Resignation | పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ ఆనంద బోస్‌ రాజీనామా
Shivalik Gas Tanker | తీరనున్న గ్యాస్​ కష్టాలు.. నేడు గుజరాత్ తీరానికి శివాలిక్​ నౌక
Sukhoi Su-30 Crash | కూలిపోయిన సుఖోయ్​ యుద్ధ విమానం.. ఇద్దరు పైలెట్ల మృతి
TAGGED:dieselDiesel Shortageeconomic stabilitygasIndia War ChallengesIndiansLPGpetrolPM Narendra Modi
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Municipal Workers Protest Municipal Workers Protest | వేతనాలు అడిగితే కేసులు పెడతారా..? కలెక్టరేట్​ ఎదుట కార్మిక సంఘాల ధర్నా
Next Article Youth Job Promises Youth Job Promises | కాంగ్రెస్‌ ప్రభుత్వం యువతకు తీరని ద్రోహం చేసింది..
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?