అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలతో పాటు దూసుకొస్తున్న ఏఐ టూల్స్ భయాలతో దేశీయంగా ఐటీ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఇది సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది.
ఉదయం 9.54 గంటల సమయంలో సెన్సెక్స్ 731 పాయింట్లు పడిపోయి.. 82,567 వద్ద కదులుతోంది. అలాగే నిఫ్టీ 201 పాయింట్లు తగ్గి 25,511 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోయి 90.96గా ఉంది. కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, భారతీ ఎయిర్‌టెల్, ఎటర్నల్, టీసీఎస్, ఇన్ఫోసిస్ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.
Indian Stock Market | స్టాక్స్ మార్కెట్ల పతనానికి కారణాలివే..
క్లాడ్ ఏఐ టూల్స్‌తో ఖర్చు తగ్గనుందని ఆంథ్రోపిక్ ప్రకటన చేసింది. ఇది భారత ఐటీ వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ప్రముఖ ఐటీ సంస్థల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. డాలర్ బలపడడం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల, రూపాయి విలువ క్షీణించింది.ట్రంప్ టారిఫ్‌ల విషయంలో అమెరికా సుప్రీం ఇచ్చిన తీర్పును ఛాన్స్‌గా తీసుకుని ఏ దేశమైనా ఆటలాడాలని చూసినట్లయితే భారీ టారిఫ్‌లు విధిస్తానని ట్రంప్ హెచ్చరించారు. దీంతో అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో నిక్కీ, షాంఘై మార్కెట్లు తప్పించి మిగతావి నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Jharkhand Air Ambulance Crash | కూలిపోయిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి

