అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indian Stock Market Crash | అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోందని యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) చెప్పినప్పటికీ పశ్చిమాసియాలో దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఎఫ్ ఐఐలు భారీగా పెట్టుబడులు ఉపసంహరిస్తుండడం, క్రూడ్ ఆయిల్ ధరల్లో ఒడిదుడుకులు, రూపాయి బలహీనపడడం కారణాలతో దేశీయ స్టాక్ మార్కెట్ ఊచకోతకు గురయ్యింది. ప్రధానంగా బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు భారీ నష్టాలతో ముగిశాయి.
Indian Stock Market Crash | ఫ్లాట్‌గా ప్రారంభమై భారీ నష్టాల్లోకి..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) బుధవారం బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ప్రారంభంలో లాభాýతో కనిపించినా తర్వాత నష్టాల్లోకి జారుకుంది. ఏ దశలోనూ ఇన్వెస్టర్ల మద్దతు లభించకపోవడంతో భారీగా పతనమైంది. ఉదయం సెన్సెక్స్ 33 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 86 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 1,565 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో ప్రారంభమై అక్కడినుంచి 68 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 465 పాయింట్లు కోల్పోయింది. చివరికి సెన్సెక్స్ 1,342 పాయింట్ల నష్టంతో 76,863 వద్ద, నిఫ్టీ 394 పాయింట్ల నష్టంతో 23,866 వద్ద స్థిరపడ్డాయి.
Indian Stock Market Crash | ఆటో, బ్యాంక్ స్టాక్స్‌లో ఒత్తిడి..
నిఫ్టీ (Nifty) ఆటో ఇండెక్స్ 3.15 శాతం, బ్యాంక్ నిఫ్టీ 2.13 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.99 శాతం, రియాలిటీ 1.71 శాతం పడిపోగా.. ఐటీ, టెలికాం, క్యాపిటల్ గూడ్స్, కన్జూమర్ డ్యూరెబుల్స్, ఎఫ్ ఎంసీజీ ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా నష్టపోయాయి. ఫార్మా 0.41 శాతం, యుటిలిటీ 0.31 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.18 శాతం, ఎనర్జీ 0.12 శాతం లాభాలతో ముగిశాయి.
Indian Stock Market Crash | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..
బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,881 కంపెనీలు లాభపడగా 2,381స్టాక్స్ నష్టపోయాయి. 152 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 74 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 200 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 7 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 12 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. ఇన్వెస్టర్లు రూ. 4.92 లక్షల కోట్లు కోల్పోయారు.
Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 2 కంపెనీలు లాభాలతో, 28 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎన్టీపీసీ 0.72 శాతం, సన్‌ఫార్మా 0.66 శాతం లాభపడ్డాయి.
Top Losers : బజాజ్ ఫైనాన్స్ 5.01 శాతం, యాక్సిస్ బ్యాంక్ 4.26 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 3.95 శాతం, ఎం అండ్ ఎం 3.81 శాతం, మారుతి 2.65 శాతం నష్టపోయాయి.
ఇది కూడా చదవండి..: Indian Stock Market | ఫ్లాట్‌గా ప్రారంభమై.. నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్

