Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Indian Stock Market Gains | ఒడిదుడుకులు ఎదురైనా.. రెండో రోజూ లాభాలతో ముగిసిన సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Indian Stock Market Gains | ఒడిదుడుకులు ఎదురైనా.. రెండో రోజూ లాభాలతో ముగిసిన సూచీలు

బిజినెస్​

Indian Stock Market Gains | ఒడిదుడుకులు ఎదురైనా.. రెండో రోజూ లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ మంగళవారం సైతం తీవ్ర ఒడిదుడుకుల మధ్య సాగింది. చివరికి సెన్సెక్స్ 567 పాయింట్లు, నిఫ్టీ 172 పాయింట్లు పెరిగాయి.

Sandeep kumar Balla_Author
Last updated: మార్చి 17, 2026 4:38 సా.
Sandeep Kumar Balla
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే...
Follow:
1 వారం ago
Share
Indian Stock Market Gains

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian Stock Market Gains | చైనా, జపాన్ మినహా మిగిలిన అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు (Stock Markets) మంగళవారం లాభాల బాటలో పయనించాయి. దీని ప్రభావం మన మార్కెట్‌పైనా కనిపించింది. అయితే రోజంతా తీవ్ర ఒడిదుడుకులు ఎదురయ్యాయి.

Contents
  • Indian Stock Market Gains | లాభాలతో ప్రారంభమై..
    • Indian Stock Market Gains | ఎఫ్ ఎంసీజీ, ఐటీ మినహా..
      • Indian Stock Market Gains | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

కనిష్టాల వద్ద కొనుగోళ్లకు మద్దతుగా నిలుస్తున్న ఇన్వెస్టర్లు.. కాస్త పెరగ్గానే ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో లాభనష్టాల మధ్య ఊగిసలాట కనిపించింది. చివరికి ప్రధాన సూచీలు వరుసగా రెండోరోజూ లాభాలతో ముగిశాయి.

Indian Stock Market Gains | లాభాలతో ప్రారంభమై..

బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు (Nifty) మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 324 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా అక్కడినుంచి 502 పాయింట్లు కోల్పోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో పుంజుకుని 690 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 85 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 147 పాయిట్లు పడిపోయింది. తిరిగి కోలుకుని కనిష్టాల వద్దనుంచి 231 పాయింట్లు పెరిగింది. అయితే గరిష్టాల వద్ద నిýదొక్కుకోలేక కొంతసేపటికే నష్టాల్లోకి జారుకున్నా.. మధ్యాహ్నం తర్వాత తిరిగి కొనుగోళ్ల మద్దతు లభించడంతో పుంజుకుని పైకి ఎగబాకాయి. చివరికి సెన్సెక్స్ 567 పాయింట్ల లాభంతో 76,070 వద్ద, నిఫ్టీ 172 పాయింట్ల లాభంతో 23,581 వద్ద స్థిరపడ్డాయి.

Indian Stock Market Gains | ఎఫ్ ఎంసీజీ, ఐటీ మినహా..

ఐటీ,(IT) ఎఫ్ఎంసీజీ (FMCG) రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు రాణించాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 0.97 శాతం, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ 0.75 శాతం నష్టపోయాయి. మెటల్ ఇండెక్స్ 2.82 శాతం, ఆటో 2.11 శాతం, రియాలిటీ 1.80 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.40 శాతం, టెలికాం 1.24 శాతం లాభాలతో ముగిశాయి.

Indian Stock Market Gains | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈ (BSE) లో నమోదైన కంపెనీలలో 2,362 కంపెనీలు లాభపడగా 1,892 స్టాక్స్ నష్టపోయాయి. 157 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 56 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 440 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 14 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.

Top gainers: బీఎస్ఈ సెన్సెక్స్‌లో 20 కంపెనీలు లాభాలతో, 10 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్ 5.70 శాతం, టాటా స్టీల్ 4.41 శాతం, ఎంఅండ్ ఎం 2.91 శాతం, బీఈఎల్ 2.39 శాతం, ఎల్‌టీ 2.29 శాతం లాభపడ్డాయి.

Top losers: ఇన్ఫోసిస్ 1.37 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.17 శాతం, ఐటీసీ 1.05 శాతం, టీసీఎస్ 0.69 శాతం, అదానిపోర్ట్స్ 0.65 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: March 17 Gold Rates | స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. పెళ్లిళ్ల సీజన్ ముందు మధ్యతరగతికి కాస్త ఊరట

Stock Market Crash | స్టాక్ మార్కెట్‌లో మరో బ్లాక్ మండే… రూ. 13.6 లక్షల కోట్ల సంపద ఆవిరి
March 13 Pre Market Analysis | ఎరుపెక్కిన గ్లోబల్ మార్కెట్లు.. భారీ నష్టాలతో ప్రారంభం కానున్న నిఫ్టీ, సెన్సెక్స్
Stock Market Volatility | వీడని యుద్ధ భయాలు.. లాభనష్టాల మధ్య ఊగిసలాటలో మార్కెట్లు
Stock Market Crash | బేర్ దెబ్బకు విలవిల్లాడుతున్న ఇన్వెస్టర్లు.. రూ. 9.71 లక్షల కోట్ల సంపద ఆవిరి
Fino Bank CEO Arrest | ఫినో బ్యాంక్​ సీఈవోకు రిమాండ్​
TAGGED:BSE market updateIndian shares rallyIndian Stock Marketnifty 50 updateNSE trading newsSensex Todaystock market news indiaStock Market Volatility
Share This Article
Facebook Whatsapp Whatsapp
Sandeep kumar Balla_Author
BySandeep Kumar Balla
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Hyderabad Rotten Chicken Hyderabad Rotten Chicken | కుళ్లిన చికెన్.. బార్లు, వైన్​ షాపులకు సప్లై
Next Article ASHA Workers Protest ASHA Workers Protest | ఆశ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సీఐటీయూ డిమాండ్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?