Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Indian Stock Market Rally | రంకెలు వేసిన బుల్.. పరుగులు తీసిన సూచీలు
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - Indian Stock Market Rally | రంకెలు వేసిన బుల్.. పరుగులు తీసిన సూచీలు

బిజినెస్​

Indian Stock Market Rally | రంకెలు వేసిన బుల్.. పరుగులు తీసిన సూచీలు

దలాల్ స్ట్రీట్‌లో చాలా రోజుల తర్వాత బుల్స్ రంకెలు వేశాయి. సెన్సెక్స్ 938 పాయింట్లు, నిఫ్టీ 257 పాయింట్లు పెరిగాయి.

Srinivas kolluri
Last updated: మార్చి 16, 2026 4:20 సా.
Srinivas Kolluri
1 వారం ago
Share
Indian Stock Market Rally

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian Stock Market Rally | పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా స్టాక్ మార్కెట్ అతలాకుతలమవుతోంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చడంతో గ్యాస్, క్రూడ్ ఆయిల్ (Crude Oil) సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి.

Contents
  • Indian Stock Market Rally | తీవ్ర ఒడిదుడుకులు..
    • Indian Stock Market Rally | రాణించిన ఆటో, బ్యాంకింగ్ రంగాలు..
      • Indian Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

రూపాయి బలహీనతతో విదేశీ సంస్థాగత మదుపరులు పెట్టుబడులను భారీగా ఉపసంహరిస్తున్నారు. దీంతో మన మార్కెట్లపై భారీగా అమ్మకాల ఒత్తిడి ఉంటోంది. సోమవారం సైతం నష్టాలతో ప్రారంభమై భారీ నష్టాల దిశగా సాగాయి. అయితే కనిష్టాల వద్ద కొనుగోలుదారులు వాల్యూ బయ్యింగ్‌కు మొగ్గు చూపడంతో సూచీలు కోలుకుని భారీ లాభాలతో ముగిశాయి.

Indian Stock Market Rally

Indian Stock Market Rally | తీవ్ర ఒడిదుడుకులు..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఉదయం సెన్సెక్స్ 148 పాయింట్ల నష్టంతో ప్రారంభమై వెంటనే కోలుకుని 568 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడడంతో ఒక్కసారిగా 1,034 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 35 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 168 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 329 పాయింట్లు పడిపోయి ఒకదశలో 23 వేల పాయింట్ల దిగువకు వచ్చింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కోలుకున్నాయి. ఇంట్రాడే కనిష్టాలనుంచి సెన్సెక్స్ 1,934 పాయింట్లు, నిఫ్టీ 329 పాయింట్లు పెరిగాయి. చివరికి సెన్సెక్స్ 938 పాయింట్ల లాభంతో 75,502 వద్ద, నిఫ్టీ 257 పాయింట్ల లాభంతో 23,408 వద్ద స్థిరపడ్డాయి.

Indian Stock Market Rally | రాణించిన ఆటో, బ్యాంకింగ్ రంగాలు..

ఆటో, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగాల షేర్లు రాణించడంతో సూచీలు పరుగులు తీశాయి. నిఫ్టీలో ఆటో ఇండెక్స్ 1.67 శాతం, ఫైనాన్షియల్ 1.32 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.22 శాతం, ఎఫ్ ఎంసీజీ ఇండెక్స్ 1.14 శాతం పెరిగాయి. రియాలిటీ 1.57 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 1.56 శాతం, ఎనర్జీ 1.36 శాతం, ఫార్మా 1.25 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.91 శాతం నష్టపోయాయి.

 

Indian Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,509 కంపెనీలు లాభపడగా 2,860 స్టాక్స్ నష్టపోయాయి. 168 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 81 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 907 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 12 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 24 కంపెనీలు లాభాలతో, 6 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. అల్ట్రాటెక్ సిమెంట్ 4.22 శాతం, ట్రెంట్ 3.01 శాతం, హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్ 2.88 శాతం, ఎంఅండ్ ఎం 2.86 శాతం, ఎటర్నల్ 2.80 శాతం లాభపడ్డాయి.

Top Losers : బీఈఎల్ 2.32 శాతం, సన్‌ఫార్మా 1.25 శాతం, పవర్‌గ్రిడ్ 0.98 శాతం, ఎయిర్‌టెల్ 0.82 శాతం, ఎన్టీపీసీ 0.59 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Lava Bold 2 5G | పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో బడ్జెట్ ధరలో ఫోన్

Gold Price Fall | దిగివస్తున్న బంగారం ధర.. ఆల్ టైం హైనుంచి సగం తగ్గిన వెండి
March 12 Pre Market Analysis | మిక్స్‌డ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. గ్యాప్ డౌన్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
VIVO T5x 5G | భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో.. వీవో టీ5ఎక్స్ 5జీ విడుదల
March 16 Pre Market Analysis | లాభాల్లో గిఫ్ట్ నిఫ్టీ.. గ్యాప్ అప్​లో ప్రారంభం కానున్న నిఫ్టీ, సెన్సెక్స్
Indian Stock Market | ఫ్లాట్‌గా ప్రారంభమై.. నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్
TAGGED:auto sector stocksbanking stocks indiaCrude OilDalal Street newsDomestic Stock MarketIndian Stock Market RallyNifty TodaySensex Todayshare market updatestock market india
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Nandini Sidha Reddy Nandini Sidha Reddy | కవి నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
Next Article Kavitha Reddy Chairman | Kavitha Reddy Chairman | ప్రజారోగ్య పరిరక్షణకు శాయశక్తులా కృషిచేస్తా: డాక్టర్​ కవితారెడ్డి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?