Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Indians Killed in Iran Attacks | ఇరాన్‌ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

అంతర్జాతీయం - Indians Killed in Iran Attacks | ఇరాన్‌ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

అంతర్జాతీయంజాతీయం

Indians Killed in Iran Attacks | ఇరాన్‌ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్​ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి చెందారు.

Srinivas kolluri
Last updated: మార్చి 3, 2026 2:24 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Indians Killed in Iran Attacks

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indians Killed in Iran Attacks | పశ్చిమాసియా ఇంకా రగులుతూనే ఉంది. ఇరాన్ (Iran)​ ప్రతీకార దాడులతో గల్ఫ్​ దేశాలు దద్దరిల్లుతున్నాయి. ఆయా దేశాల్లోని అమెరికా ఆస్తులు, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్​ డ్రోన్లు, క్షిపణులను ప్రయోగిస్తోంది.

Contents
  • Indians Killed in Iran Attacks | భారత్​లో ఆందోళన
    • Indians Killed in Iran Attacks | ఇరాన్​కు మద్దతు తెలిపిన చైనా

గల్ఫ్​ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్నారు. చాలా మంది బతుకు దెరువు కోసం వెళ్లి వలస కార్మికులుగా పనిచేస్తున్న వారే ఉన్నారు. ఇరాన్​ దాడులతో వారు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు చనిపోయారు. ఇరాన్‌ చేపట్టిన ప్రతీకార దాడుల్లో ముగ్గురు భారత నావికులు చనిపోయినట్లు షిప్పింగ్‌ డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు. ఒమన్‌ (Oman) తీరంలోని రెండు నౌకలపై దాడి జరిగిందన్నారు. ఈ విషయాన్ని ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం సైతం ధ్రువీకరించింది.

Indians Killed in Iran Attacks | భారత్​లో ఆందోళన

గల్ఫ్​ దేశాలపై దాడులతో భారత్​లో ఆందోళన నెలకొంది. ఆయా దేశాలకు వలస వెళ్లిన వారి కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కాగా భారత ప్రభుత్వం ప్రవాస భారతీయుల రక్షణ కోసం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ (PM Modi) గల్ఫ్​ దేశాల నేతలతో ఫోన్​లో మాట్లాడారు.

Indians Killed in Iran Attacks | ఇరాన్​కు మద్దతు తెలిపిన చైనా

ఇజ్రాయెల్​, అమెరికా– ఇరాన్​ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు దేశాలు మధ్య మొదలైన యుద్ధం ఇప్పటికే గల్ఫ్​ దేశాలకు పాకిన విషయం తెలిసిందే. తాజాగా ఈ యుద్ధంలోకి చైనా (China) ఎంట్రీ ఇచ్చింది. ఇరాన్​కు డ్రాగన్​ దేశం మద్దతు తెలిపింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాపాడుతామని పేర్కొంది. వెంటనే ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఆపాలంది. కాగా తాజా పరిస్థితులను భారత్​ నిశితంగా పరిశీలిస్తోంది. పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పాలని సూచిస్తుంది. గల్ఫ్​ దేశాలపై దాడులను మోదీ ఖండించారు.

దీనిని కూడా చదవండి : Trump Iran War Comments | యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తాం.. ట్రంప్​ సంచలన వ్యాఖ్యలు

Qatar Iran Missile | ఖతార్​పై ఇరాన్​ క్షిపణి దాడి.. భయంతో ప్రజల పరుగులు
Trump Iran Announcement | అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక ప్రకటన.. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై ఐదు రోజుల పాటు దాడులు వాయిదా
Nitish Kumar Resigns | బీహార్​లో కీలక పరిణామం.. రాజీనామా చేయనున్న నితీశ్
Texas Oil Refinery | ట్రంప్ కీలక ప్రకటన.. టెక్సాస్‌లో అమెరికా మొదటి ఆయిల్ రిఫైనరీ నిర్మాణం
Israel Iran Warning | ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌కు ఇజ్రాయల్‌ వార్నింగ్..
TAGGED:China supports IranGulf tensions 2026Indian expats in GulfIndian sailors killedIran Gulf crisisIran US conflictIsrael Iran warOman ship attack
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Snake Bite Incident Snake Bite Incident | కాటేసిన పాముతో హాస్పిటల్​కు వెళ్లిన వ్యక్తి
Next Article Lahore US Consulate Attack Lahore US Consulate Attack | లాహోర్​లోని యూఎస్​ కాన్సులేట్ పై దాడి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?