అక్షరటుడే, వెబ్‌డెస్క్ : IndiGo CEO William Walsh | ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ కొత్త సీఈవోగా బ్రిటిష్ ఎయిర్వేస్ మాజీ చీఫ్ విలియమ్ వాల్ష్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఇండిగో సంస్థ(IndiGo) ప్రకటన చేసింది. గత సీఈవో పీటర్ ఎల్బర్స్ (CEO Pieter Elbers).. వ్యక్తిగత కారణాలతో ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
దేశంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్ సంస్థ అయిన ఇండిగో తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బ్రిటిష్ ఎయిర్వేస్ మాజీ అధినేత విలియం వాల్ష్ (William Walsh)ను ఎంపిక చేసింది. పీటర్ ఎల్బర్స్ రాజీనామా చేసిన కొద్ది వారాల్లోనే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
IndiGo CEO William Walsh | ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డీజీగా..
విలియం వాల్ష్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు. ఇంతకు ముందు ఆయన బ్రిటిష్ ఎయిర్ వేస్, ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ గ్రూప్ (IAG) సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించారు.
IndiGo CEO William Walsh | ఇండిగో విమానాల రద్దు వివాదంతో..
పీటర్ ఎల్బర్స్ తన పదవీ కాలం ముగియడానికి 18 నెలల ముందే ఇండిగో సీఈవో పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 2025లో జరిగిన ఫ్లైట్ రద్దులే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ సమస్య వల్ల భారత్‌తో పాటు విదేశాల్లోని వేల మంది ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
The Board of IndiGo announces the appointment of William Walsh as Chief Executive Officer pic.twitter.com/fMK11P9R8h
— ANI (@ANI) March 31, 2026
ఇది కూడా చదవండి..: Bengaluru Software Couple | బెంగళూరులో సాఫ్ట్వేర్ దంపతుల ఆత్మహత్య
