అక్షరటుడే, వెబ్డెస్క్: Indigo Emergency Landing | విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్ (Indira Gandhi Airport)లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. రన్‌వే 28 దగ్గర ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఇండిగో విమానం (IndiGo Flight) శనివారం ఉదయం ఇంజిన్ వైఫల్యం కారణంగా అత్యవసరంగా ల్యాండింగ్ (Emergency Landing) అయింది. బోయింగ్ 737 విమానం 6E 579 విశాఖపట్నం నుంచి ఢిల్లీకి బయలు దేరింది. ఈ విమానాన్ని ఇండిగో, టర్కీకి చెందిన కోరెండన్ ఎయిర్‌లైన్స్ నుంచి వెట్-లీజుకు తీసుకుంది. ఈ ఫ్లైట్లో 161 మంది ప్రయాణికులు ఉన్నారు.
Indigo Emergency Landing | ప్రయాణికులు సురక్షితం
విమానం ఢిల్లీ సమీపంలోకి రాగానే.. ఇంజిన్లో సమస్య తలెత్తింది. దీనిని గుర్తించిన పైలట్ ఏటీసీకి సమాచారం అందించాడు. అనంతరం అత్యవసరంగా ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ (Delhi Airport)లో ల్యాండ్ చేశాడు. దీంతో అధికారులు పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా తరలించామని, ఎలాంటి నష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10:54 గంటలకు అత్యవసర ల్యాండింగ్ గురించి తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు.
సమాచారం అందుకున్న ఎయిర్పోర్టు, ఎయిర్‌లైన్స్ అధికారులు విమానానికి మరమ్మతులు చేపట్టారు. అవసరమైన తనిఖీలు, నిర్వహణ పనులు జరుగుతున్నాయి. వినియోగదారులు, సిబ్బంది భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యత ఇండిగో విమానయాన సంస్థ ప్రతినిధి తెలిపారు.
ఇది కూడా చదవండి..: KP Sharma Oli Arrest | నేపాల్ మాజీ ప్రధాని ఓలీ శర్మ అరెస్ట్

