అక్షరటుడే, వెబ్డెస్క్: IndiGo Flight Services | మధ్యప్రాచ్యంలో యుద్ధం నేపత్యంలో పరిస్థితులు నిరంతరం మారుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇండిగో విమానయాన సంస్థ కీలక అప్డేట్ ఇచ్చింది. తన విమాన నెట్‌వర్క్‌ను క్రమంగా పునర్నిర్మించే ప్రయత్నాలు చేస్తోంది. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని ప్రకటించింది. ఇందులో భాగంగా ఎంచుకున్న యూరప్ రూట్లకు కూడా సేవలను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది.
IndiGo Flight Services | అందుబాటులోకి పలు విమాన సేవలు
ఇండిగోకు మార్చి 16 నుంచి 28 వరకు పలు విమానాలు నడపడానికి షెడ్యూల్ చేసింది. దీని ఆధారంగా ప్రస్తుతం టికెట్స్ బుకింగ్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే ఇబ్బందులు పడ్డ ప్రయాణికుల కోసం వారి ఫ్లైట్లను తిరిగి షెడ్యూల్ చేయడంలో మా సిబ్బంది అన్ని సహాయసహకారాలు అందిస్తున్నారని సంస్థ పేర్కొంది. అయితే ప్రకటించిన షెడ్యూల్లో చిన్నపాటి మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున తాజా సమాచారం కోసం అప్డేట్గా ఉండాలని సూచించింది. అలాగే నిర్ధారిత PNR ఉన్న కస్టమర్లు ఏదైనా సహాయం కావాలంటే మా కస్టమర్ సెంటర్ను +91 124 6173838 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపింది.
IndiGo (@IndiGo6E) posts, “Update: IndiGo Flights to the Middle East and Select European Routes As the situation across parts of the Middle East continues to evolve, IndiGo remains in close coordination with the relevant authorities to progressively rebuild its flight network… pic.twitter.com/Qwx6V98cj4
— Press Trust of India (@PTI_News) March 14, 2026
ఇది కూడా చదవండి.. : Iran India Gas Support | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల మధ్య భారత్‌కు ఇరాన్ భరోసా.. హర్మూజ్ జలసంధి దాటిన గ్యాస్ ట్యాంకర్

