అక్షరటుడే, కామారెడ్డి: Indiramma Houses | సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో.. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి మండలం (Kamareddy Mandal) చిన్నమల్లారెడ్డి గ్రామంలో శనివారం భిక్కనూర్ లక్ష్మీ, చిట్యాల రాజమణిలకు సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమంలో షబ్బీర్ అలీ (Shabbir Ali) పాల్గొన్నారు.
Indiramma Houses | సీఎం ఆదేశాల మేరకు..
ఈ సందర్భంగా సీఎం ఆదేశాల మేరకు లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు, వస్త్రాలు అందజేశారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో ఫోన్ చేసి మాట్లాడించారు. లబ్ధిదారులకు మంత్రి సీతక్క (Minister Seethakka) శుభాకాంక్షలు తెలిపారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో.. కూలిపోయిన ఇళ్లను చూసి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చలించిపోయారన్నారు. అధికారంలోకి రాగానే ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.

Indiramma Houses | ఇచ్చిన మాట ప్రకారం..
ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేయడం జరిగిందని షబ్బీర్ అలీ తెలిపారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న మరికొన్ని ఇళ్లను త్వరలో పూర్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), అదనపు కలెక్టర్ మధు మోహన్, గ్రామ సర్పంచ్ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, మున్సిపల్ ఛైర్మన్ ఇప్ప ఉమారాణి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: CP Saichaitanya Iftar | ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీపీ సాయిచైతన్య

