Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Indiramma Houses Role | ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత..?: ఎమ్మెల్యే కేవీఆర్​
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Indiramma Houses Role | ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత..?: ఎమ్మెల్యే కేవీఆర్​

తెలంగాణనిజామాబాద్

Indiramma Houses Role | ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత..?: ఎమ్మెల్యే కేవీఆర్​

ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత అనేది చెప్పాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీ సెషన్ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు.

Shashi kiran mottala
Last updated: మార్చి 25, 2026 4:31 సా.
Shashi kiran Mottala
2 రోజులు ago
Share
Indiramma Houses Role |
Indiramma Houses Role | ఇందిరమ్మ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత..?: ఎమ్మెల్యే కేవీఆర్​

అక్షరటుడే, కామారెడ్డి: Indiramma Houses Role | ఇందిరమ్మ ఇళ్లలో (indiramma houses) కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత అనేది చెప్పాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి(Mla KVR) ప్రశ్నించారు. అసెంబ్లీ సెషన్ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడారు.

Contents
  • Indiramma Houses Role | ‘డబుల్​’ ఇళ్లు అధ్వానం..
    • Indiramma Houses Role | ఇష్టం వచ్చినట్లుగా కేటాయించారు..
      • అవినీతికి ఆస్కారం లేకుండా..

Indiramma Houses Role | ‘డబుల్​’ ఇళ్లు అధ్వానం..

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై తాను గత రెండు సెషన్లలో రెండు ప్రశ్నలు అడిగానని కేవీఆర్​ అన్నారు. అందులో ఒక ప్రశ్నకు మాత్రమే సమాధానమిస్తూ డబుల్ బెడ్​రూమ్​ ఇళ్లలో (double bedroom houses) వసతులు కల్పిస్తామన్నారని తెలిపారన్నారు. అయితే డబుల్ ఇళ్లు బీటలు వారాయని, అద్దాలు పగిలిపోయాయని, అసాంఘిక కార్యకలాపాలకు(telangana politics) అడ్డాగా మారుతున్నాయని వివరించారు. ఈ సమయంలో ఇంకా ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే నష్టమన్నారు. ప్రస్తుతం ప్రజాపాలన 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో త్వరగా పనులు పూర్తి అర్హులైన వారికి కేటాయించాలని కోరారు. ప్రస్తుతం డబుల్ ఇళ్ల స్థానంలో ‘ఇందిరమ్మ ఇళ్లు’ కొనసాగుతున్నాయని తెలిపారు.

Indiramma Houses Role | ఇష్టం వచ్చినట్లుగా కేటాయించారు..

గతంలో తెలిసిన వాళ్లని, అనుచరులు అని ఇష్టం వచ్చినట్టు ఇళ్లకు కేటాయించారని, ప్రస్తుతం అలా జరగకుండా చూడాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు (housing scheme india) వేస్తే తాను కమిటీల విషయంలో జోక్యం చేసుకోలేదన్నారు. కమిటీ నిర్ణయాల మేరకే పనులు జరుగుతున్నాయన్నారు. అయితే ప్రస్తుతం కొందరు తాము ఉన్న పొజిషన్ చెప్పుకుంటూ, అధికారంలో ఉన్నామని, తమకే ఇవ్వాలని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై సంబంధిత శాఖ మంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలచ్చి వారికి మనోధైర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

అవినీతికి ఆస్కారం లేకుండా..

అవినీతికి ఆస్కారం లేకుండా అర్హులైన వారికి ఇళ్లు ఇవ్వాలని వెంకటరమణా రెడ్డి కోరారు. మా వాళ్లు, మీ వాళ్లు అని ఇవ్వడం ద్వారా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆలోచించాలన్నారు. గత సెషన్​లో ‘డబుల్’ ఇళ్ల నిర్మాణాల్లో కేంద్ర ప్రభుత్వ పాత్ర (government schemes) ఎంత అని అడిగితే ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదని చెప్పారు. దీనిపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఇందిరమ్మ కమిటీలలో (assembly news) సర్పంచ్ ఛైర్మన్​గా ఉన్నారని తాను అనుకుంటున్నానని తెలిపారు. అయితే గ్రామాల్లోకి వెళ్లినప్పుడు పలువురు సర్పంచులు ఈ అంశంపై సర్పంచులకు కమిటీకి సంబంధం లేదని అంటున్నారని తన దృష్టికి తెచ్చారని, దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

ఇది కూడా చదవండి: Chicken Shops Bandh | ఏప్రిల్1 నుంచి చికెన్ షాపులు బంద్!

Telangana Pension Scheme | కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు.. ఇంటర్​ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
Ramchander Rao Allegations | ఎంఐఎంను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
Dr Vishal Akula | ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్ రాష్ట్ర కో ఛైర్మన్‌గా డాక్టర్​ విశాల్
Telangana Thunderstorm Alert | పగలు భానుడి భగభగ.. రాత్రి ఉరుములు, మెరుపులు.. ఆ ప్రాంతాల్లో అలెర్ట్​!
Unseasonal Rain Damage | వడగళ్లు.. పిడుగులు.. అకాల వర్షాలతో అతలాకుతలం!
TAGGED:assembly newsdouble bedroom housesgovernment schemeshousing scheme indiaIndiramma HousesTelangana Politics
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Chicken Shops Bandh Chicken Shops Bandh | ఏప్రిల్1 నుంచి చికెన్ షాపులు బంద్!
Next Article RTC Bus Discount RTC Bus Discount | ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్​న్యూస్​.. ఆ బస్సుల్లో 30 శాతం డిస్కౌంట్​
2 వ్యాఖ్యలు
  • పింగుబ్యాకు: BLO Absence Issue | బీఆల్​వోల గైర్హాజరుపై కలెక్టర్​ ఆగ్రహం
  • పింగుబ్యాకు: Country Bomb Incident | సదాశివనగర్​లో కలకలం.. నాటుబాంబు..

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?