Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Indiramma Houses Scheme | పథకాలను పక్కాగా అమలుచేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Indiramma Houses Scheme | పథకాలను పక్కాగా అమలుచేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

నిజామాబాద్

Indiramma Houses Scheme | పథకాలను పక్కాగా అమలుచేయాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేయలని కలెక్టర్ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్​ అన్నారు. రామిరెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

Srinivas kolluri
Last updated: మార్చి 5, 2026 2:45 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Indiramma Houses Scheme
Indiramma Houses Scheme

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Indiramma Houses Scheme | ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేయలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​ ఆదేశించారు. రామారెడ్డి మండలం (Ramireddy Mandal) గొల్లపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు.

Contents
  • Indiramma Houses Scheme | ఇందిరమ్మ ఇళ్ల పథకం..
    • Indiramma Houses Scheme | మౌలిక వసతుల కల్పనపై ఆరా
      • Indiramma Houses Scheme | అభ్యసన సామర్థ్యాలపై పరీక్ష..

Indiramma Houses Scheme | ఇందిరమ్మ ఇళ్ల పథకం..

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు మెరుగు లక్ష్మి, రాజయ్య నిర్మించుకుంటున్న ఇంటి పనుల పురోగతిని కలెక్టర్ (Collector Ashish Sangwan) ప్రత్యక్షంగా పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యతగా.. త్వరితగతిన పూర్తిచేయాలని, ఉగాదిలోగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. అనంతరం గొల్లపల్లి గ్రామంలోని (Gollapalli Village) మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్ పాఠశాలలోని వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్న తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

Indiramma Houses Scheme | మౌలిక వసతుల కల్పనపై ఆరా

విద్యార్థులకు పోషకాహారం అందేలా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్​ సూచించారు. విద్యార్థులకు రాగి జావాపై ఇస్తున్నారా లేదా అని ఆరాతీశారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, మౌలిక వసతులపై కలెక్టర్ వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలల్లో పరిశుభ్రత, నాణ్యమైన ఆహారం, విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు సూచించారు.

Indiramma Houses Scheme
Indiramma Houses Scheme

Indiramma Houses Scheme | అభ్యసన సామర్థ్యాలపై పరీక్ష..

ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యాస సామర్థ్యాలను కలెక్టర్​ పరిశీలించారు. విద్యార్థులకు నోట్ బుక్స్​ను అందించి అవసరమైన సూచనలు ఇచ్చారు. అనంతరం విద్యార్థులతో లెక్కలు చేయించి, ఇంగ్లిష్​ పాఠాలను చదివించారు. విద్యార్థులు చురుకుగా పాల్గొని మంచి ప్రతిభ కనబర్చినందుకు కలెక్టర్ వారిని అభినందించారు. విద్యార్థులు పాఠాలను బాగా అభ్యసించి మంచి ఫలితాలు సాధించాలని, ఉపాధ్యాయులు విద్యార్థులలో అభ్యాస నైపుణ్యాలను మరింతగా పెంపొందించేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో వీణ, తహశీల్దార్, పీడీ హౌసింగ్ విజయపాల్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Yellareddy RDO Prabhakar | ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ

Dhannapal Indiramma houses | నిజామాబాద్​లో ఒక్క డబుల్ బెడ్​రూం ఇల్లు కూడా ఇవ్వలేదు: ఎమ్మెల్యే ధన్​పాల్
Electricity Artisan Strike | సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు వెళ్తాం: విద్యుత్​ ఆర్టిజన్​ కార్మికుల అల్టిమేటం
SSC Paper Leak | నిజామాబాద్​లో ఎస్​ఎస్​సీ హిందీ పేపర్​ లీకేజీ.. నెట్టింట వైరల్​.. తొమ్మిది మంది ఉపాధ్యాయులపై వేటు!
Yellareddy RDO Prabhakar | ఎల్లారెడ్డి ఆర్డీవోగా ప్రభాకర్ బాధ్యతల స్వీకరణ
Nizamabad Drunk Driving | పకడ్బందీగా డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు.. రెండు వారాల్లోనే 246 కేసుల నమోదు
TAGGED:Collector Ashish SangwanGollapalli VillageIndiramma Houses SchemeRamireddy Mandal
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Inter Exams Malpractice Inter Exams Malpractice | మాల్​ప్రాక్టీస్​ జరగకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ ఇలాత్రిపాఠి
Next Article Minuteman III Missile Minuteman III Missile | అణు క్షిపణిని పరీక్షించిన అమెరికా.. ఇరాన్‌పై దాడుల వేళ ప్రయోగం..
4 వ్యాఖ్యలు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?