అక్షరటుడే, భీమ్గల్: Indiramma Houses Scheme | సొంత ఇల్లు అనేది ప్రతి పేద కుటుంబానికి ఒక కల అని, ఆ కలను ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నెరవేరుస్తున్నారని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి (Manala Mohan Reddy) అన్నారు.
భీమ్గల్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో శనివారం దర్శనం గోదావరి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన మాజీ డీసీసీబీ ఛైర్మన్ కుంట రమేష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
Indiramma Houses Scheme | కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే..
గత పదేళ్లలో పేదవాడికి ఇల్లు అనేది ఒక తీరని కలగానే మిగిలిపోయిందని మానాల విమర్శించారు. నేడు ఇందిరమ్మ ఇల్లు రూపంలో తమ కల నెరవేరడంతో పేద ప్రజలు ఆనందభాష్పాలతో సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఏప్రిల్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.

Indiramma Houses Scheme | అర్హులు సద్వినియోగం చేసుకోవాలి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ నర్సారెడ్డి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లేష్, మండల ఉపాధ్యక్షులు నరేందర్, సర్పంచులు నవీన్, ప్రశాంత్, ఉప సర్పంచ్ నవీన్, ఇందిరా కమిటీ సభ్యులు రమణ, రాజేందర్, రాజేశ్వర్, లహరి, లావణ్య, కిసాన్ సెల్ మండల ప్రెసిడెంట్ రవి, మహిళా అధ్యక్షురాలు స్వరూప, నాయకులు మధు, నరేష్, సతీష్, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Indiramma Houses Kamareddy | నెరవేరిన సీఎం హామీ..రేపు చిన్నమల్లారెడ్డిలో రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం

