Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Indiramma houses second phase | ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన.. ఏప్రిల్​ 1 నుంచి రెండో విడత
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

తెలంగాణ - Indiramma houses second phase | ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన.. ఏప్రిల్​ 1 నుంచి రెండో విడత

తెలంగాణ

Indiramma houses second phase | ఇందిరమ్మ ఇళ్లపై కీలక ప్రకటన.. ఏప్రిల్​ 1 నుంచి రెండో విడత

రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను ఏప్రిల్ 1 నుంచి మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ నెలాఖరులోగా లక్ష మంది గృహ ప్రవేశాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Srinivas kolluri
Last updated: మార్చి 7, 2026 8:31 సా.
Srinivas Kolluri
3 వారాలు ago
Share
Indiramma houses second phase

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma houses second phase | ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1 నుంచి రెండో దశ ఇళ్లను మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) తెలిపారు.

Contents
  • Indiramma houses second phase | ఉచిత ఇసుక సరఫరా
    • Indiramma houses second phase | ధరల నియంత్రణకు కమిటీ

ప్ర‌జాపాల‌న‌- ప్ర‌గ‌తి ప్రణాళికలో భాగంగా హౌసింగ్ శాఖ 99 రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచ‌ర‌ణ‌పై జిల్లా హౌసింగ్ పీడీల‌తో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాష్ట్రంలో ప్ర‌తి పేద‌వాడి ఆత్మ‌గౌర‌వానికి చిహ్నంగా నిలిచేలా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలో ప్ర‌జాప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇందిర‌మ్మ ఇళ్ల పథకం అమ‌లు చేస్తోందన్నారు. ఈ నెలాఖరులోగా మొదటి దశలో ఇళ్లు మంజూరైన వారిలో లక్ష మంది గృహ ప్రవేశాలు చేపట్టేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Indiramma houses second phase | ఉచిత ఇసుక సరఫరా

ఏప్రిల్ 1 నుంచి రెండోదశ ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses) మంజూరు కార్యక్రమం మొదలు కానుందని మంత్రి తెలిపారు. మొదటి దశలో రాష్ట్రమంతటా గ్రౌండింగ్ కాని (20 శాతం) లబ్ధిదారుల సమ్మతి తీసుకొని స్థానిక ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీల సూచనల మేరకు రెండో దశలో ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తోందన్నారు. లబ్ధిదారులకు ఇసుక లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

indiramma illu 1

Indiramma houses second phase | ధరల నియంత్రణకు కమిటీ

మహిళా సంఘాల ఆధ్వర్యంలో బ్రిక్ యూనిట్లు (Bric Units) ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. నిర్మాణ సామగ్రి ధరల భారం లబ్ధిదారులపై పడకుండా జిల్లా స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు చురుగ్గా పని చేయాలని ఆదేశించారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు సకాలంలో చెల్లించకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండో దశ లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు.

దీనిని కూడా చదవండి : Maoists Surrender Revanth Reddy | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులందరూ లొంగిపోవాలి: సీఎం రేవంత్​రెడ్డి

Illegal Quarry | అక్రమ క్వారీలు నిర్వహిస్తున్న ‘పొంగులేటి’ : హరీశ్​రావు
Ranikhet Disease | కొక్కెర వ్యాధితో వేలాది కోళ్ల మృతి
HYDRAA Land Protection | 11 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా
Bulldozer Rajyam | రాష్ట్రంలో బుల్డోజర్​ రాజ్యం నడుస్తోంది : కేటీఆర్​
urea shortage warning | యూరియా కొరత వచ్చే అవకాశం : సీఎం రేవంత్​రెడ్డి
TAGGED:free sand schemeIndiramma houses second phaseIndiramma housing schemePonguleti Srinivas ReddyTelangana government housingtelangana housing scheme
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article eye0 కాలుష్యం, వాతావరణ మార్పుల నుంచి కళ్లకు రక్షణ.. డాక్టర్ వివేక్ సింగ్ కీలక సూచనలు
Next Article Nizamabad Drunk Driving | Nizamabad Drunk Driving | పకడ్బందీగా డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు.. రెండు వారాల్లోనే 246 కేసుల నమోదు
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?