అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Indiramma Housing Scheme | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ పథకం (Indiramma Scheme) కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆయన అధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్ష నిర్వహించారు.
Indiramma Housing Scheme | క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ..
క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ లక్ష్య సాధనకు కృషి చేయాలని, నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే ఉపేక్షించబోమని సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, తాగునీటి సరఫరా, గోదావరి పుష్కర ఏర్పాట్ల పనులు, యంగ్ ఇండియా మోడల్ స్కూళ్ల నిర్మాణాలపై సమీక్షించారు. అలాగే ఎరువుల పంపిణీ, పంటలకు సాగు నీటి లభ్యత తదితర అంశాలపై సంబంధిత అధికారులతో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) మాట్లాడారు. ఒక్కో నియోజకవర్గం వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని, వాటిలో ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి, ఎన్ని ఇళ్ల ఏ దశలో నిర్మాణంలో ఉన్నాయనే వివరాలను తెలుసుకున్నారు.
Indiramma Housing Scheme | కలెక్టర్ అసహనం..
ఇళ్ల నిర్మాణాలలో ఆశించిన పురోగతి కనిపించడం లేదని కలెక్టర్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. క్రమం తప్పకుండా సమీక్ష నిర్వహిస్తూ, నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ, ఎందుకు పురోగతి కనిపించడం లేదని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని, వాటిని ప్రభుత్వానికి నివేదించి పరిష్కరించేలా కృషి చేస్తామని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy) సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నిర్మాణాలలో వేగం పెరగాలని, ప్రభుత్వం మలివిడత మంజూరీలు ఇచ్చేందుకు సన్నద్ధం అయినందున మొదటి విడత ఇళల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయించాలన్నారు.

Indiramma Housing Scheme | తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చూడాలి..
జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికతో వ్యవహరించాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ప్రభత్వ సలహాదారు ఆదేశించారు. కొత్తగా బోర్లు వేయడం కంటే, ఉన్న వాటినే ఫ్లషింగ్ చేయించడం, అవసరమైన మరమ్మతులు చేయించాలని సూచించారు. పైప్‌లైన్ నిర్మాణాలను పూర్తి చేయించాలని, ప్రతి నివాస ప్రాంతానికి మిషన్ భగీరథ శుద్ధి జలాలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలకు అవసరమైన స్థలాల కేటాయింపు ప్రక్రియను వెంటనే పూర్తి చేసి పనులు ప్రారంభం అయ్యేలా చూడాలన్నారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, బోధన్, ఆర్మూర్ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ మధుసూదన్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఆర్డీవో సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Bike Theft Gang | అంతర్రాష్ట్ర బైక్ దొంగల ముఠా గుట్టురట్టు

