అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Indiramma Housing Scheme | రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం(congress government) కృతనిశ్చయంతో ఉందని కాంగ్రెస్ నిజామాబాద్ (nizamabad news) కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) అన్నారు.
Indiramma Housing Scheme | నగరంలోని 37వ డివిజన్‌లో..
నగరంలోని 37వ డివిజన్‌లో గోరోల్ల గంగామణికి ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరుకాగా ఆమె సోమవారం గృహప్రవేశం నిర్వహించారు. కార్యక్రమానికి బొబ్బిలి రామకృష్ణను ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు. అనంతరం బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ..పేద ప్రజలకు గృహవసతి (telangana schemes) కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఇలాంటి పథకాల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా కృషి జరుగుతుందని తెలిపారు. అనంతరం గంగామణికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు టెంట్‌హౌస్ శ్రీనివాస్, చక్రి దౌలత్, రాజ్ గగన్ , జనరల్ సెక్రెటరీ శంకర్, కార్యనిర్వాహక సభ్యులు బస్వా సాయి, సన్నీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

