Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Induction Stove Demand | మార్కెట్‌లో గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌ స్టాక్ లకు పెరిగిన డిమాండ్
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

జాతీయం - Induction Stove Demand | మార్కెట్‌లో గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌ స్టాక్ లకు పెరిగిన డిమాండ్

జాతీయం

Induction Stove Demand | మార్కెట్‌లో గ్యాస్ కొరత.. ఇండక్షన్ స్టౌ స్టాక్ లకు పెరిగిన డిమాండ్

Srinivas kolluri
Last updated: మార్చి 11, 2026 4:53 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
Induction Stove Demand

అక్షరటుడే, వెబ్​డెస్క్: Induction Stove Demand | పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయడంతో ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఎల్‌పీజీ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీంతో గ్యాస్ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడే భారత్ వంటి దేశాలతో కొరత ఏర్పడుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం (Central Government) గ్యాస్ బుకింగ్ గడువును 21 రోజులనుంచి 25 రోజులకు పెంచింది.

Contents
  • Induction Stove Demand | యుద్ధం తీవ్రత ఇంకా పెరిగి..
  • Induction Stove Demand | ఆ స్టాక్స్‌కు పెరిగిన డిమాండ్

Induction Stove Demand | యుద్ధం తీవ్రత ఇంకా పెరిగి..

అత్యవసర సేవలకు మినహా మిగిలినవాటికి కమర్షియల్ సిలిండర్ల సరఫరాను నిలిపివేసింది. దేశంలో 40 రోజులకు సరిపడేంతగా ఎల్పీజీ నిల్వలు ఉన్నాయని కేంద్రం చెబుతోంది. అయితే యుద్ధం తీవ్రత ఇంకా పెరిగి.. దీర్ఘాకాలంపాటు కొనసాగితే గ్యాస్ నిల్వలు అడుగంటుతాయి. దీంతో గ్యాస్ కొరత (Gas shortage) తీవ్రమయ్యే అవకాశాలున్నాయన్న ఆందోళనతో చాలామంది వినియోగదారులు ముందు జాగ్రత్తగా అదనపు సిలిండర్లను బుక్ చేసుకుంటుండడంతో కృత్రిమ కొరత ఏర్పడింది.

Induction Stove Demand | ఆ స్టాక్స్‌కు పెరిగిన డిమాండ్

  • గ్యాస్ ధరలు పెరగడం, సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతుండడంతో వినియోగదారులు ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్నారు. దీంతో ఇండక్షన్ కుక్‌టాప్, ఎలక్ట్రిక్ స్టౌలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా వంటగది ఉపకరణాల తయారీ కంపెనీలైన టీటీకే ప్రెస్టీజ్, స్టవ్ క్రాఫ్ట్ వంటి షేర్లు భారీగా లాభపడుతున్నాయి.
  • ఇండక్షన్ కుక్‌టాప్‌లు టేబుల్‌టాప్ స్టవ్‌ల విభాగంలో బలమైన ఉనికిని కలిగి ఉన్న బటర్‌ఫ్లై గాంధీమతి కంపెనీ షేరు ధర బుధవారం ఇంట్రాడేలో గరిష్టంగా 18 శాతానికిపైగా పెరిగింది. చివరికి 14.80 శాతం లాభంతో రూ. 694 వద్ద ముగిసింది.
  • టీటీకే ప్రెస్టీజ్ కంపెనీ షేరు ధర ఇంట్రాడేలో గరిష్టంగా 15 శాతం పెరిగింది. చివరికి 10.52 శాతం లాభంతో 535 వద్ద స్థిరపడింది.
  • పీజియన్ బ్రాండ్‌తో గుర్తింపు పొందిన స్టవ్ క్రాఫ్ట్ కంపెనీ షేరు ధర ఇంట్రాడేలో గరిష్టంగా సుమారు 18 శాతం పెరిగింది. చివరికి 12 శాతం లాభంతో 544 వద్ద స్థిరపడింది.
  • బజాజ్ ఎలక్ట్రికల్స్ (Bajaj Electricals) షేరు ధర ఇంట్రాడేలో గరిష్టంగా సుమారు 3 శాతం వరకు పెరిగినా.. మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా చివరికి 0.81 శాతం లాభంతో ముగిసింది. ఈ స్టాక్ ధర మార్చి 5వ తేదీన రూ. 355 వద్ద ఉంది.
  • ప్రీమియం కిచెన్ అప్లయెన్సెస్ తయారీదారు అయిన హావెల్స్ ఇండియా షేరు ధర కూడా పెరిగింది. 0.55 శాతం లాభంతో 1,365 వద్ద ముగిసింది.

ఇది కూడా చదవండి..: Small Notes ATM | ఇక ఏటీఎంల నుంచే చిన్న నోట్లు.. రూ.10, రూ.20, రూ.50 డ్రా చేసే కొత్త వ్యవస్థకు కేంద్రం సిద్ధం

Menaka Guruswamy Rajya Sabha | అందరి దృష్టి ఆ లాయర్‌పైనే.. ఎందుకంటే?
Telangana Assembly Elections | 2029లో అసెంబ్లీ ఎన్నికలు : సీఎం రేవంత్​రెడ్డి
One Rupee Shoes Offer | రూపాయికే బూట్లని ప్రచారం.. ప్రజలు పోటెత్తడంతో లాఠీఛార్జీ
Gas Shortage Ayodhya | గ్యాస్​ కొరతతో అయోధ్యలో నిలిచిన ప్రసాదం పంపిణీ
Kolkata Earthquake | కోల్​కతాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు
TAGGED:Bajaj ElectricalsCentral GovernmentGas shortagegas shortage indiaIndia energy crisisIndian stock market newsInduction Stove Demandlpg supply crisis
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article YS Jagan Corruption Allegations YS Jagan Corruption Allegations | రాష్ట్రంలో భారీగా అవినీతి : వైఎస్​ జగన్​
Next Article Digital Census India Digital Census India | జనగణన విధులను పక్కగా నిర్వహించాలి
1 వ్యాఖ్య

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?