అక్షరటుడే, ఇందూరు: Indur Tirumala Brahmotsavam | మోపాల్ మండలం నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమలలో (Indur Tirumala) బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏడో రోజు శనివారం ఉదయం నిత్య హవన పూర్ణాహుతి తర్వాత సామూహిక భగవద్గీత పఠన కార్యక్రమం నిర్వహించారు. తదుపరి షాక్తా పరిషత్ బృందం గురువు పవన్ శర్మ, మహిళా శిష్య బృందం ఆధ్వర్యంలో విష్ణు సహస్రనామ పారాయణం, లలిత సహస్రనామ పారాయణం, సౌందర్యలహరి సామూహిక గానం ఏర్పాటు చేశారు. భక్తులు భక్తి పరవశ్యంలో మునిగిపోయారు.
Indur Tirumala Brahmotsavam | తరలివస్తున్న భక్తులు
బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు నిజామాబాద్ నగరం నుండే కాకుండా నర్సింగ్‌పల్లి చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి.
Indur Tirumala Brahmotsavam | సాయంత్రం అశ్వవాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు..
అశ్వ వాహనంపై వచ్చిన శ్రీవారు సిరి సంపదలను తీసుకొని వస్తాడని దేవనాథ జీయర్ స్వామి అన్నారు. సాయంత్రం పూర్ణాహుతి తరువాత శ్రీవారిని అశ్వవాహనంపై (telangana temple events) ఊరేగించి దోపోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆళ్వారుల్లో చివరి ఆళ్వారు అయిన తిరుమంగై ఆళ్వారు జీవిత చరిత్రను దోపోత్సవంగా ప్రదర్శించారు. తిరుమంగై ఆళ్వారుగా (tirumangai alwar story) మారిన పరకాలుని కథ రూపకమే దోపోత్సవం. ఆనాడు రాజుగా పరిపాలించిన పరకాలుడు కుముదవల్లి ప్రేమలో పడిన తర్వాత 1008 మంది శ్రీవైష్ణవులకు ప్రతిరోజు భోజనాలు ఏర్పాటు చేసి.. భోజనాలు (తదియారాధన) ఏర్పాటు చేయడానికి తన దగ్గర ఉన్న సంపద సరిపోకపోతే దారిదోపిడీలు చేస్తూ ఆ దోపిడీ చేసిన సొమ్ముతో శ్రీవైష్ణవులకు తదియారాధన కార్యక్రమాన్ని కొనసాగించారని దేవనాథ జీయర్ స్వామి తెలిపారు.
దోపిడి దొంగగా మారిన తర్వాత..
దోపిడీ దొంగగా మారిన తర్వాత మహా విష్ణువు దర్శన భాగ్యంతో ఆళ్వారుగా మారిన ఘట్టాన్ని దోపొత్సవంలో అద్భుతంగా చుపెట్టడంతో భక్తులు పరవశించిపోయారు. గ్రామానికి చెందిన ఆడబిడ్డలు మంగళహారతులతో స్వామి వారిని ఆహ్వానించారు. గ్రామ యువత ఆటపాటలతో అశ్వవాహన ఊరేగింపులో పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలు దేవనాథ స్వామి వారి మంగళా శాసనాలతో జరగడం పూర్వ జన్మ సుకృతం అని ఆలయ ధర్మకర్త నరసింహారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ప్రధాన ధర్మకర్త నర్సింహారెడ్డి (hindu religious festival telangana) తోపాటు సినీ నిర్మాతలైన దిల్ రాజు(Producer Dil Raju), శిరీష్ విజయసింహా రెడ్డి, డీసీసీ నాయకుడు బస్వారెడ్డి, సాయ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు రాములు, నర్సారెడ్డి, పృథ్వీ, ప్రవీణ్, నరాల సుధాకర్, రమేష్, భాస్కర్, నరేందర్, గంగారెడ్డి, సాయిలు, రాములు, మురళి, యజ్ఞాచార్యులు అనంత్ కుమార్ ఆచార్యతో పాటు ఆలయ అర్చక స్వాములు సంపత్ కుమారాచార్య , రోహిత్ కుమారాచార్యులు, విజయ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.


ఇది కూడ చదవండి: Deepa Aradhana Significance | హిందూ సంప్రదాయంలో దీపారాధన ఆనవాయితీ.. ఆ రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

