అక్షరటుడే, బోధన్: Inter Exams Malpractice | ఇంటర్ పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) అన్నారు. పట్టణంలోని ఇంటర్ పరీక్షా కేంద్రాలను ఆమె గురువారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
Inter Exams Malpractice | పట్టణంలోని పలు కళాశాలల్లో..
పట్టణంలోని విజేత జూనియర్ కళాశాల, ఉషోదయ, విద్యా వికాస్ జూనియర్ కాలేజీలలో (Vidya Vikas Junior Colleges) కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉన్న తాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలను పరిశీలించారు. సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు జరుగుతున్నాయా లేదా అని గమనించారు. పలు కేంద్రాల్లో లోపాలను గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోధన్ పట్టణంలోని అన్ని పరీక్షా కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి తనకు వివరాలు తెలియజేయాలని డీఐఈవో రవికుమార్ (DIEO Ravikumar)ను ఆదేశించారు.
Inter Exams Malpractice | గైర్హాజరైన విద్యార్థులు..
పరీక్షల్లో భాగంగా గురువారం ఫస్టియర్ గణితం-1బీ, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టులకు సంబంధించిన పరీక్ష జరగగా, ఆయా కేంద్రాల్లో గైర్హాజరైన విద్యార్థుల సంఖ్య గురించి కలెక్టర్ ఆరా తీశారు. విజేత జూనియర్ కళాశాలలో మొత్తం 441 మందికి గాను 12మంది గైర్హాజరయ్యారని చీఫ్ సూపరింటెండెంట్ స్వర్ణలత తెలిపారు. ఉషోదయ కాలేజీలోని సెంటర్లో 358 మందికి గాను 21 మంది హాజరు కాలేదని చీఫ్ సూపరింటెండెంట్ అనిల్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అలాగే, విద్యావికాస్ జూనియర్ కాలేజీలోని సెంటర్లో 406 మంది విద్యార్థులకు 398 మంది హాజరయ్యారని కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ రవీందర్ తెలిపారు.

Inter Exams Malpractice | మాస్‌కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా..
పరీక్షా కేంద్రాల్లోకి ఎవరు కూడా సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తేకుండా, కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించాలని కలెక్టర్ సూచించారు. బాలికలను మహిళా సిబ్బంది తనిఖీ చేసే ప్రక్రియకు సహకారం అందించాలని ఏఎన్ఎంలకు సూచించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పక్కాగా పరీక్షలు జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చదవండి..: Bheemgal Tiger Movement | కమ్మర్‌పల్లి అడవుల్లో పులి సంచారం.. అధికారుల అప్రమత్తం

