అక్షర టుడే, వెబ్డెస్క్: Inter Exams | ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు ప్రశ్న పత్రాలు చేరుకున్నాయి. ఆయా పరీక్ష కేంద్రాలకు సమీపంలోని పోలీస్ స్టేషన్లో వాటిని భద్రపరిచారు. జిల్లా వ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 36,963 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
Inter Exams | ఎంత మంది విద్యార్థులంటే..
జిల్లాలో మొదటి సంవత్సరం విద్యార్థులు 19,299 మంది ఉండగా.. రెండో సంవత్సరం విద్యార్థులు 17,664 మంది పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు 2,963 మంది, రెండో సంవత్సరంలో 2,771 మంది ఉన్నారు.
Inter Exams | 58 పరీక్ష కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా మొత్తం 58 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడం జరిగిందని తెలిపారు. పరిష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని కోరారు. అలాగే చూచి రాతలను నిరోధించడానికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను నియమించారు. అలాగే జిల్లా హైపర్ కమిటీ, పరీక్షల నిర్వహణ కమిటీ అధికారులు నిరంతరం పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తాయి.
ఆన్లైన్లో హాల్ టికెట్లు…
విద్యార్థులు హాల్ టికెట్లు పొందడంలో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటే నేరుగా ఆన్లైన్లో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్ విద్యాధి కారి రవి కుమార్ తెలిపారు. హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం లేదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Kavitha New Party | గద్వాల నుంచే కొత్త పార్టీ..: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

