Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: Inter Results | నిజామాబాద్​ జిల్లా ఇంటర్ ఫలితాల్లో బాలికల జోరు..
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

నిజామాబాద్ - Inter Results | నిజామాబాద్​ జిల్లా ఇంటర్ ఫలితాల్లో బాలికల జోరు..

నిజామాబాద్

Inter Results | నిజామాబాద్​ జిల్లా ఇంటర్ ఫలితాల్లో బాలికల జోరు..

ఇంటర్​ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. ఇంటర్మీడియట్​ వార్షిక ఫలితాలను అధికారులు ఆదివారం ఉదయం 11 గంటలకు విడుదల చేశారు.

Shashi kiran mottala
Last updated: ఏప్రిల్ 12, 2026 4:12 సా.
Shashi kiran Mottala
7 గంటలు ago
Share
Inter Results |
Inter Results | ఇంటర్ ఫలితాల్లో బాలికల జోరు..

అక్షరటుడే, భీమ్​గల్: Inter Results | ఇంటర్​ ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. ఇంటర్మీడియట్ (Intermediate Education)​ వార్షిక ఫలితాలను అధికారులు ఆదివారం ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగింది. ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు సైతం మెరుగైన ఫలితాలు (Nizamabad Inter Results ) సాధించారు. మొత్తం జిల్లాలో 66.19 శాతం మంది పాస్​ అయ్యారు.

Contents
  • Inter Results | నిజామాబాద్​ జిల్లాలో..
    • Inter Results | జనరల్​లో..
      • Inter Results | ఒకేషనల్ విభాగంలో
      • Inter Results | మెరుగైన ఫలితాలు
      • అధ్యాపకుల కృషితో..
      • – రవికుమార్​, డీఐఈవో

Inter Results | నిజామాబాద్​ జిల్లాలో..

జిల్లాలో (telangana education) ఇంటర్​ పరీక్షలు ఫిబ్రవరి, మార్చిలో కొనసాగిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అధికారులు రిజల్ట్స్​ రిలీజ్​ చేశారు. సెకండియర్​లో విద్యార్థులు 66.19శాతం మంది, ఫస్టియర్​లో 56.64 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విభాగంలో ఫస్టియర్​లో 49.65 శాంతం, సెకండియర్​లో 67.68శాతం పాస్​ అయ్యారు.

Inter Results | జనరల్​లో..

ఇంటర్​ జనరల్​ ఫస్టియర్​లో మొత్తం 15,547 మంది పరీక్షలకు హాజరు కాగా 8,806 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. బాలికలు 8,711 మంది పరీక్షలకు హాజరుకాగా 5,868 మంది పాస్​ అయి 67.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురలో 6,836 మందికి 2,938 మంది ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్​లో మొత్తం 13,876 మందికి 9,187 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 7,606 మంది పరీక్షలు రాయగా.. 5,823 మంది, బాలురు 6 ,273 మందికి 3,364 మంది పాస్​ అయ్యారు. బాలికల ఉత్తీర్ణత శాతం 76.56 శాతం, బాలురులది 53.63 శాతంగా నమోదు అయింది.

Inter Results | ఒకేషనల్ విభాగంలో

ఒకేషనల్ విభాగంలో ఫస్టియర్​లో 2,562 మంది పరీక్షలకు హాజరు కాగా 1,272 మంది విద్యార్థులు పాస్​ అయ్యారు. 49.69శాతం పాస్​ పర్సంటేజీ నమోదు అయింది. సెకండియర్​లో 2,345 మంది పరీక్షలకు హాజరు కాగా 1,587 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 67.68 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Inter Results | మెరుగైన ఫలితాలు

జిల్లాలో గత సంవత్సరం కన్నా ఉత్తీర్ణత శాతం పెరిగింది. మెరుగైన ఫలితాలు వచ్చాయి. 2024‌–25 విద్యా సంవత్సరంలో ఇంటర్​ సెకండియర్​లో 58.21 శాతం ఉత్తీర్ణత సాధించగా ప్రస్తుతం 66.19 శాతం మంది పాస్​ అయ్యారు. ఫస్టియర్​లో 2024–25 విద్యా సంవత్సరంలో 53.37శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 56.64 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

అధ్యాపకుల కృషితో..

– రవికుమార్​, డీఐఈవో

dieo ravi

జిల్లాలో ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. అధ్యాపకుల కృషి, విద్యార్థుల కష్టం ఫలితంగానే గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగింది.బాలికలు అన్ని విభాగాల్లోనూ అగ్రస్థానంలో నిలవడం గర్వకారణం.

 

ఇది కూడా చదవండి : Tirumala July Tickets | 18 నుంచి జూలై నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే..

Naikpod Community Development | ఆదివాసి నాయక్​పోడ్​ కుల వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి
RSS Role Hindu Society | హిందూ సమాజాన్ని జాగృతం చేయడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకం : ఎమ్మెల్యే ధన్​పాల్
Kamareddy Railway Modernization | రైల్వే ఆధునీకరణ పనులకు నిధులివ్వండి: కేంద్ర రైల్వే మంత్రికి ఎమ్మెల్యే వినతి
BJP Dinesh Kulachari | మాట ఇచ్చి నిలబెట్టుకోవడం బీజేపీ నైజం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి
Illegal Sand Transport | ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ట్రాక్టర్ల పట్టివేత..
TAGGED:academic performanceEducation News Indiaexam results districtgirls performance educationinter results 2026Intermediate Educationintermediate results indiaNizamabad Inter Resultsstudent results analysisTelangana Education
Share This Article
Facebook Whatsapp Whatsapp
Shashi kiran mottala
ByShashi kiran Mottala
Follow:
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article Tirumala July Tickets Tirumala July Tickets | 18 నుంచి జూలై నెల శ్రీవారి దర్శన టికెట్ల కోటా విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Next Article Urban Forest Parks Urban Forest Parks | అర్బన్​ పార్కులతో ఆహ్లాదం: మంత్రి పొన్నం ప్రభాకర్
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?