అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Inter Supplementary Exams | రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో అధికారులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ప్రకటించారు. మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
Inter Supplementary Exams | రేపటి నుంచి దరఖాస్తులు
ఇంటర్ ఫలితాలను (Inter Results) ఆదివారం ఉదయం అధికారులు విడుదల చేశారు. ఫస్ట్ ఇయర్లో 66.94 శాతం, సెకండియర్‌లో 75.61 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు. రీ కౌంటింగ్ , రీ వెరిఫికేషన్ (Recounting, Re-verification) కోసం ఏప్రిల్ 13 నుంచి 20 వరకు అప్లయ్ చేసుకోవచ్చని బోర్డ్ అధికారులు తెలిపారు. అలాగే సప్లిమెంటరీ పరీక్షలకోసం కూడా ఈ నెల 13 నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. సప్లిమెంటరీ పరీక్షలు రెండు సెషన్లలో జరగనున్నాయి. ఉదయం ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉంటాయి.
ఇది కూడా చదవండి : Vishnu Priya | విష్ణు ప్రియ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్‌పై వివాదం.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
