అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL 2026 Injuries | క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (Indian Premier League 2026) ప్రారంభానికి ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల గాయాలు ఫ్రాంచైజీలకు పెద్ద సవాలుగా మారాయి.
కీలక పేసర్లు అందుబాటులో లేకపోవడం వల్ల జట్లు తమ ప్రణాళికలను మార్చుకోవాల్సి వస్తోంది. ఈ సీజన్‌కు దూరమైన ప్రముఖ పేసర్లలో ఆస్ట్రేలియా నుంచి పాట్ కమిన్స్ (Pat Cummins), హేజిల్‌వుడ్, నాథన్ ఎల్లిస్, జాక్ ఎడ్వర్డ్స్ (Jack Edwards) ఉన్నారు. అలాగే న్యూజిలాండ్ నుంచి ఫెర్గుసన్, ఇంగ్లాండ్ నుంచి సామ్ కరణ్, భారత్ నుంచి హర్షిత్ రానా కూడా ఈ జాబితాలో చేరారు.
IPL 2026 Injuries | గాయాలే ప్రధాన కారణం
ఈ ఆటగాళ్లలో ఎక్కువమంది గాయాల కారణంగా దూరమవుతున్నారు. ఫిట్‌నెస్ సమస్యలు ఫ్రాంచైజీలకు పెద్ద దెబ్బగా మారాయి. ముఖ్యంగా హర్షిత్ రాణా మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే అందరూ పూర్తిగా దూరం కావడం లేదు. ప్యాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ (Josh Hazlewood), లాకీ ఫెర్గూసన్ వంటి ఆటగాళ్లు ప్రారంభ మ్యాచ్‌లు లేదా తొలి దశకు మాత్రమే అందుబాటులో ఉండరు. కమిన్స్ గాయం కారణంగా ఆలస్యంగా జట్టులో చేరనున్నాడు. హేజిల్‌వుడ్ కూడా తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడు. లాకీ ఫెర్గూసన్ (Lockie Ferguson) గైర్హాజరీకి గాయంతో పాటు వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయి. జాతీయ జట్టు బాధ్యతలతో పాటు, కొత్తగా పుట్టిన శిశువుతో సమయం గడపాలనే నిర్ణయం వల్ల అతను తొలి మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నాడు.
IPL 2026 Injuries | బౌలింగ్ కాంబినేషన్‌లో మార్పులు
ఇక సామ్ కరణ్, ఎల్లిస్, ఎడ్వర్డ్స్, హర్షిత్ రానా మాత్రం ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ముఖ్యంగా ఎలిస్‌కు వచ్చిన హామ్‌స్ట్రింగ్ గాయం చెన్నై జట్టుకు గట్టి దెబ్బగా మారింది. ఈ పరిస్థితుల వల్ల జట్లు తమ బౌలింగ్ కాంబినేషన్‌లో మార్పులు చేయాల్సి వస్తోంది. బ్యాకప్ ప్లేయర్లపై ఆధారపడాల్సిన అవసరం పెరిగింది. ఇది మ్యాచ్ ఫలితాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే మరోవైపు, ఈ గాయాలు యువ ఆటగాళ్లకు గొప్ప అవకాశంగా మారనున్నాయి. కొత్త ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్న ఈ సీజన్, అనూహ్య మలుపులతో ఆసక్తికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..: BCCI Contract Changes | బీసీసీఐ కాంట్రాక్ట్ మార్పులతో బుమ్రాకు షాక్?.. రూ.2 కోట్ల నష్టం అంటూ సోషల్ మీడియాలో చర్చ

