Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: IPL 2026 Opening Match | చిన్నస్వామిలో ఐపీఎల్ మహాసంగ్రామం.. బెంగళూరు–హైదరాబాద్ పోరుకు రంగం సిద్ధం!
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

క్రీడలు - IPL 2026 Opening Match | చిన్నస్వామిలో ఐపీఎల్ మహాసంగ్రామం.. బెంగళూరు–హైదరాబాద్ పోరుకు రంగం సిద్ధం!

క్రీడలు

IPL 2026 Opening Match | చిన్నస్వామిలో ఐపీఎల్ మహాసంగ్రామం.. బెంగళూరు–హైదరాబాద్ పోరుకు రంగం సిద్ధం!

ఐపీఎల్ 19వ సీజన్ ఘనంగా ప్రారంభం కానుంది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ–సన్‌రైజర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుండగా, అభిమానుల్లో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది.

Srinivas kolluri
Last updated: మార్చి 28, 2026 10:36 ఉద.
Srinivas Kolluri
10 గంటలు ago
Share
IPL 2026 Opening Match

అక్షరటుడే, వెబ్​డెస్క్ : IPL 2026 Opening Match | ఈ వేసవిలో క్రికెట్ అభిమానులకు అసలైన పండగ మొదలవుతోంది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 19వ సీజన్ మార్చి 28న ఘనంగా ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్‌లోఆర్సీబీ (Royal Challengers Bengaluru), స‌న్‌రైజ‌ర్స్ (Sunrisers Hyderabad) జట్లు చిన‌స్వామి స్టేడియం వేదికగా తలపడనున్నాయి.

Contents
  • IPL 2026 Opening Match | వ‌ర్షం ప‌డ‌నుందా?
    • IPL 2026 Opening Match | హైదరాబాద్ జట్టుకు ఇషాన్ కిష‌న్ కెప్టెన్సీ

చాలా కాలం తర్వాత చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium)పై ఉన్న నిషేధం తొలగిపోవడంతో ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది. ఈసారి సొంత మైదానంలో ఆర్సీబీ బలంగా నిలబడాలని చూస్తోంది. గత సీజన్‌లో ఇక్కడ ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఆర్సీబీ రెండు మాత్రమే గెలిచినప్పటికీ, ఈసారి పరిస్థితులు మారుతాయని అభిమానులు ఆశిస్తున్నారు.

IPL 2026 Opening Match | వ‌ర్షం ప‌డ‌నుందా?

ఈ మైదానంలో విరాట్ కోహ్లీ (Virat Kohli)కు అద్భుతమైన రికార్డు ఉంది. 106 ఇన్నింగ్స్‌ల్లో 3,618 పరుగులు చేసి కోహ్లీ తన ఆధిపత్యాన్ని చాటాడు. అతని ప్రదర్శన ఈ మ్యాచ్‌లో కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌పై వాతావరణం కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. బెంగళూరు వాతావరణ శాఖ ప్రకారం మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నప్పటికీ, సాయంత్రం మ్యాచ్ సమయానికి వర్షం పడే అవకాశాలు కేవలం 5 శాతం మాత్రమే. ఒకవేళ వర్షం అంతరాయం కలిగించినా మ్యాచ్ పూర్తిగా రద్దు అయ్యే అవకాశం తక్కువగా ఉందని, ఓవర్లు తగ్గించే అవకాశం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

IPL 2026 Opening Match | హైదరాబాద్ జట్టుకు ఇషాన్ కిష‌న్ కెప్టెన్సీ

ఈ సీజన్‌లో ఇరు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగుతున్నాయి. ఆర్సీబీకి ర‌జ‌త్ ప‌టిదార్ నాయకత్వం వహిస్తుండగా, హైదరాబాద్ జట్టుకు ఇషాన్ కిష‌న్ (Ishan Kishan)  కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కోహ్లీ అనుభవం, పాటిదార్ నాయకత్వం ఒకవైపు ఉంటే, ట్రావిస్ హెడ్, క్లాసెన్ వంటి పవర్‌హిటర్లతో హైదరాబాద్ జట్టు మరోవైపు బలంగా కనిపిస్తోంది. మార్చి 28న సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ సాయంత్రం 7:00 గంటలకు వేయనున్నారు. ఈసారి చిన్నస్వామి స్టేడియంలో ఎటువంటి ఓపెనింగ్ వేడుకలు నిర్వహించడం లేదని నిర్వాహకులు తెలిపారు. ప్రేక్షకులు ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించవచ్చు. మొబైల్ వినియోగదారులు జియో హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్‌ను చూడవచ్చు.

ఇది కూడా చదవండి : IPL 2026 schedule | ఐపీఎల్​ పూర్తి షెడ్యూల్‌ విడుదల

Rinku Singh Father | టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్‌ ఇంట్లో విషాదం.. తండ్రి ఖంచంద్ర సింగ్ కన్నుమూత
T20 World Cup Final | వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ తో ఫైట్.. పాత ట్రెండ్‌ని బ‌ట్టి ప్రపంచకప్ విజేతగా భారత్.. ?
India Semi final Chances | జింబాబ్వే చిత్తుగా ఓడ‌డంతో ప్రమాదంలో టీమిండియా.. భారత్ సెమీస్ ఆశలు క్లిష్టం.. NRR కీలకం
Jio Hotstar: భారత్ vs ఇంగ్లాండ్ సెమీఫైనల్ పోరుతో జియోహాట్‌స్టార్ గ్లోబల్ స్ట్రీమింగ్ రికార్డులు బద్దలు
BCCI Reward India | టీమ్‌ ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లో తెలుసా!
TAGGED:Chinnaswamy StadiumCricket NewsIPL 2026 Opening MatchIPL live matchIPL Opening Matchishan kishanRoyal Challengers Bengalurusunrisers hyderabadVirat Kohli
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article Gold Silver Rates Gold Silver Rates | అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావం.. స్థిరంగా బంగారం ధరలు, భారీగా ప‌డిపోయిన వెండి ధ‌ర‌లు
Next Article Telangana RC DL Delivery Telangana RC DL Delivery | తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్.. లైసెన్స్, ఆర్సీ కార్డులు ఇక నేరుగా ఇంటికే!
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?