Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • ఆదిలాబాద్
    • వరంగల్
    • ఖమ్మం
    • రంగారెడ్డి
    • మెదక్
    • మహబూబ్‌నగర్
    • నల్గొండ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్రప్రదేశ్​
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • లైఫ్​స్టైల్​
  • క్రీడలు
  • More..
    • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
    • టెక్నాలజీ
    • భక్తి
Reading: iQOO Z11x 5G | ఐక్యూ నుంచి మరో ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?
Share
Akshara TodayAkshara Today
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
  • Home
  • తాజా వార్తలు
  • తెలంగాణ
  • జిల్లాలు
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • సినిమా
  • బిజినెస్​
  • క్రైం
  • భక్తి
  • లైఫ్​స్టైల్​
  • టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్​ & జాబ్స్​
© 2023 Akshara Today. All Rights Reserved.

బిజినెస్​ - iQOO Z11x 5G | ఐక్యూ నుంచి మరో ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?

బిజినెస్​తాజా వార్తలు

iQOO Z11x 5G | ఐక్యూ నుంచి మరో ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే?

ఐక్యూ కంపెనీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువస్తోంది. ఈనెల 12న మధ్యాహ్నం 12 గంటలకు జెడ11ఎక్స్ మోడల్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది.

Srinivas kolluri
Last updated: మార్చి 10, 2026 4:13 సా.
Srinivas Kolluri
2 వారాలు ago
Share
iQOO Z11x 5G

అక్షరటుడే, వెబ్​డెస్క్: iQOO Z11x 5G | చైనాకు చెందిన ఐక్యూ బడ్జెట్ ధరలో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్‌ (Smart Phone)ను భారత మార్కెట్‌లో రిలీజ్ చేయడానికి సన్నద్ధమయ్యింది. ఐక్యూ జెడ11ఎక్స్ పేరుతో ఈనెల 12న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Contents
  • iQOO Z11x 5G | అదనపు ఫీచర్లు..
    • iQOO Z11x 5G | వేరియంట్స్ :

భారీ బ్యాటరీ, శక్తిమంతమైన ప్రాసెసర్‌తో తీసుకువస్తున్న ఈ ఫోన్ కంపెనీ అధికారిక వెబ్ సైట్‌తో పాటు అమెజాన్‌ (Amazon)లోనూ అందుబాటులో ఉండనుంది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలలో రివీల్ అయిన వివరాల ప్రకారం దీని స్పెసిఫికేషన్స్ ఇలా ఉండనున్నాయి.

డిస్‌ప్లే : 6.72 ఇంచ్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇది 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 1080 X 2400 పిక్సల్స్ రిజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది.

ఐపీ68 /ఐపీ69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది.

ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తుంది. రెండేళ్లపాటు ఓఎస్, నాలుగేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనుంది.
ఈ సెగ్మెంట్‌లో 10 లక్షల అంటుటు స్కోర్ కలిగి ఉన్న ఫోన్ ఇదేనని కంపెనీ తెలిపింది.

కెమెరా సెటప్ : వెనకవైపు 50 మెగా పిక్సెల్ సోనీ ఏఐ మెయిన్ వైడ్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సెల్ టెలీఫొటో లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెట్ అప్ ఉంది. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. దీనితో 4కే వీడియో రికార్డింగ్ చేయవచ్చు.

బ్యాటరీ సామర్థ్యం : 7200 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. రివర్స్ చార్జింగ్ సౌలభ్యమూ ఉంది. బ్యాటరీ ఆరేళ్లపాటు మన్నుతుందని కంపెనీ చెబుతోంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 40 గంటల పాటు వీడియో, 93 గంటలపాటు ఆడియో ప్లేబ్యాక్, 15.4 గంటలపాటు గేమింగ్, 18.7 గంటలపాటు సోషల్ మీడియా చూడొచ్చని పేర్కొంది.

iQOO Z11x 5G | అదనపు ఫీచర్లు..

సర్కిట్ టు సెర్చ్, ఏఐ క్రియేషన్, ఏఐ గేమ్ వాయిస్ చేంజర్, 4దీ గేమ్ వైబ్రేషన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

iQOO Z11x 5G | వేరియంట్స్ :

ప్రిస్మాటిక్ గ్రీన్, టైటాన్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 18 వేలలోపు ఉండే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Gold Silver Rates Today | భగ్గుమంటున్న పసిడి ధరలు.. ఆదివారం గోల్డ్, సిల్వర్ రేట్లు ఇలా ఉన్నాయి!

Gold Rates March 20 | గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఒక్కరోజులోనే భారీగా పడిపోయిన బంగారం ధర!
Special Intensive Revision | త్వరలో తెలంగాణతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో SIR.. నోటిఫికేషన్‌ విడుదల
Rythu Bharosa Funds | అన్నదాతలకు గుడ్​న్యూస్​.. రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి..
March 25 Horoscope | నూతన ఒప్పందాలతో వ్యాపార విస్తరణ.. ఈ రాశుల వారికి గోల్డెన్ ఛాన్స్!
Colombia Plane Crash | కొలంబియాలో విషాదం.. కుప్పకూలిన సైనిక విమానం.. భారీ ప్రాణ నష్టం!
TAGGED:AmazoniQOO Z11x 5GSmart Phone
Share This Article
Facebook Whatsapp Whatsapp
Srinivas kolluri
BySrinivas Kolluri
Follow:
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Previous Article KTR on Six Guarantees KTR on Six Guarantees | ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో నిలదీస్తాం : కేటీఆర్​
Next Article Nareddy Mohan Reddy | Nareddy Mohan Reddy | రోడ్డు ప్రమాదంలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు మృతి
వ్యాఖ్యలు లేవు

స్పందించండి స్పందనను రద్దుచేయి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Akshara Today

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక’.. అనే సిద్ధాంతంతో ‘అక్షరటుడే’ ముందుకు సాగుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, జాతీయం, అంతర్జాతీయం, సినిమా, భక్తి,, క్రీడలు, బిజినెస్​, టెక్నాలజీ, లైఫ్​స్టైల్, ఎడ్యుకేషన్​ మరియు జాబ్స్​​ తదితర వార్తలు అందిస్తూ లక్షల మంది పాఠకుల ఆదరాభిమానాలు చూరగొంటున్నాం.

Quick Links

  • Home
  • About Us
  • Contact Us
  • Advertise With Us

Policies and Guidelines

  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

Follow Us

© 2023 Akshara Today Network. All Rights Reserved.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?