అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran Amazon Data Center | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. తమపై దాడికి ప్రతీకారంగా ఇరాన్ దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్ (Israel)తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు, ఆస్తులపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్ సైతం టెహ్రాన్‌పై బాంబులు వేస్తోంది.
Iran Amazon Data Center | యూఏఈపై..
యూఏఈలోని అమెజాన్ డేటా సెంటర్ (Amazon Data Center)పై ఇరాన్ దాడి చేసింది. దీంతో డేటా సెంటర్ భారీగా దెబ్బతింది. పశ్చిమాసియాలోని యూఎస్ స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. 390 క్షిపణులు, 830 డ్రోన్లతో దాడులు చేసింది. UAEపై 541 డ్రోన్లు, 165 క్షిపణులతో దాడులు చేయగా.. 506 డ్రోన్లు, 152 క్షిపణులను కూల్చేసినట్లు యూఏఈ ప్రకటించింది. మరోవైపు కువైట్‌పై టెహ్రాన్ 97 క్షిపణులు, 283 డ్రోన్లతో దాడి చేసింది. తన భూభాగంపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ టెహ్రాన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని మూసివేసినట్లు ప్రకటించింది.
Iran Amazon Data Center | నేవీ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం
ఇరాన్ నేవీ హెడ్ క్వార్టర్స్‌ను ధ్వంసం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. 9 ఇరాన్ యుద్ధనౌకలు సముద్రంలో మునిగిపోయాయని చెప్పారు. మిగిలిన నౌకల కోసం వేట కొనసాగుతుందన్నారు. ఇరాన్ నౌక దళం మొత్తం నాశనం అయిందని చెప్పారు. ఇరాన్ తమతో చర్చలు కోరుకుంటుందని ట్రంప్ పేర్కొన్నారు. ఊహించిన దాని కంటే వేగంగా తమ ఆపరేషన్ సాగుతోందన్నారు. ఈ దాడుల్లో 48 మంది ఇరాన్ నేతలు చనిపోయినట్లు ప్రకటించారు.

Iran Amazon Data Center | 43 మంది మృతి
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. మెహ్రాన్ క్షిపణి దాడిలో 43 మంది ఇరాన్ భద్రతా సిబ్బంది మృతి చెందారు. ఇరాన్‌లోని బాలికల పాఠశాలలో జరిగిన క్షిపణి దాడిలో మృతుల సంఖ్య 165కి చేరింది.
ఇది కూడా చదవండి..: Iran Massive Attacks Warning | పెద్ద ఎత్తున దాడులు చేస్తాం.. ఇరాన్ వార్నింగ్

