అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran attack US tanker | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాక్ సమీపంలో అమెరికాకు చెందిన చమురు ట్యాంకర్ (Oil Tanker)పై ఇరానియన్ ఆత్మాహుతి పడవ దాడి చేసింది. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించినట్లు సమాచారం.
పర్షియన్ గల్ఫ్‌లో ఇరాక్ తీరం సమీపంలో రెండు నౌకలపై ఇరాన్ దాడి చేసింది. అమెరికాకు చెందిన సేఫ్‌సీ విష్ణు, గ్రీస్‌కు చెందిన జెఫిరోస్ నౌకలపై దాడి జరిగినట్లు అధికారులు గుర్తించారు. సేఫ్‌సీ విష్ణు నౌక (US Oil Tanker) మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉండగా.. జెఫిరోస్‌పై మాల్టా జెండా ఉందని తెలుస్తోంది. ఈ నౌకలు తీరంలో చమురు సేకరిస్తున్న సమయంలో సూసైడ్ బోటు ఢీకొంది. దీంతో పెద్ద ఎత్తున పేలుడు చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో రెండు పడవల్లో 38 మంది సిబ్బంది ఉండగా.. ఒక భారతీయుడు చనిపోయాడు. మిగతా వారిని భద్రతా సిబ్బంది రక్షించారు.
Iran attack US tanker | భారతీయులే అధికం
రవాణా నౌకలపై ఇరాన్ దాడులు (Iran Attacks) భారతీయులను కలవరపెడుతున్నాయి. ప్రపంచంలో నౌకల్లో పని చేసే సిబ్బందిలో దాదాపు 15 శాతం భారతీయులు ఉంటారు. దీంతో ఆయా దాడుల్లో వారికి నష్టం జరుగుతోంది. MEA ప్రతినిధి రణధీర్ జస్వాల్ బుధవారం ఇద్దరు భారతీయులు (Indians), ఇజ్రాయెల్‌లో ఒకరు మరియు దుబాయ్‌లో మరొకరు దాడుల్లో గాయపడ్డారని చెప్పారు. ఈ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయులకు సహాయం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇది కూడా చదవండి..: Hormuz Strait India | భారత్‌కు ఊరట.. ‘హార్ముజ్’ ద్వారా రవాణాకు అనుమతి

