అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran attacks | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 (Operation True Promise 4) పేరిట మరోసారి గల్ఫ్ దేశాలపై విరుచుకుపడింది. కువైట్ (Kuwaot), దుబాయ్ పోర్టులపై పెద్ద ఎత్తున క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో పలువురు అమెరికా సైనికులు మృతి చెందారు. మూడు అమెరికా నౌకలు సముద్రంలో మునిగిపోయాయి.
అమెరికా సైనిక స్థావరాలు, వాటి ఆస్తులపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ట్రూ ప్రామిస్ 4 ఆపరేషన్ ప్రారంభించింది. అమెరికాకు చెందిన అనేక భారీ పరిశ్రమలపై క్షిపణి, డ్రోన్ దాడులు జరిగాయని, వాటిలోని కొన్ని భాగాలు ధ్వంసమైనట్లు ఇరాన్ ప్రకటించింది. ఆపరేషన్ సమయంలో అమెరికా యుద్ధ విమానాలు తమ లాంచ్పాడ్లపై దాడికి యత్నించినట్లు ఐఆర్జీసీ పేర్కొంది. అయితే అమెరికన్ MQ9 మానవరహిత విమానాన్ని తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చివేసిందని చెప్పింది. ఫార్స్ ప్రావిన్స్ దక్షిణ ప్రాంతంలో ఒక అమెరికన్ F-16 యుద్ధ విమానం దెబ్బతిని, సౌదీ అరేబియాలోని ఒక విమానాశ్రయంలో దిగకముందే ధ్వంసమైందని ఇరాన్ తెలిపింది.
Iran attacks | ప్రతీకారం తీర్చుకుంటాం
పారిశ్రామిక లక్ష్యాలపై దాడి చేసినందుకు తాము ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా పాలకులను హెచ్చరించినట్లు ఇరాన్ తెలిపింది. ఈ దాడి కేవలం ఒక హెచ్చరిక మాత్రమేనని పేర్కొంది. తమ పరిశ్రమలపై దాడి పునరావృతమైతే తదుపరి ప్రతిస్పందన అంచనాలకు మించి ఉంటుందని హెచ్చరించింది.
Iran attacks | అమెరికన్ సైనికుల మృతి
ఇరాన్ దాడుల్లో భారీగా అమెరికన్ సైనికులు మృతి చెందినట్లు సమాచారం. దుబాయ్‌లో మరణించిన, గాయపడిన అమెరికన్లను తరలించడానికి అంబులెన్సులు గంటల తరబడి తీరిక లేకుండా ఉన్నాయని ఇరాన్ తెలిపింది. ఈ ప్రాంతం అమెరికా సైనికులకు శ్మశానవాటికగా మారుతుందని హెచ్చరించింది. ఇరాన్ దాడుల్లో తమ సైనికులు చనిపోలేదని అమెరికా (America) ప్రకటించింది. ఇరాన్ ప్రభుత్వం సోషల్ మీడియాలో అబద్ధాలను ప్రచారం చేస్తోందని యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై పలు డ్రోన్ దాడులు జరిగాయి. దీంతో రాడార్ వ్యవస్థ దెబ్బతింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఈ దాడులను ఇరాన్, దాని అనుబంధ సంస్థలు, అది మద్దతు ఇచ్చే సాయుధ వర్గాలు జరిపాయని కువైట్ పౌర విమానయాన సంస్థ ప్రతినిధి తెలిపారు. భద్రతాపరమైన ఆందోళనల కారణంగా కువైట్, బహ్రెయిన్‌తో సహా ప్రధాన విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసి వేశారు.
దీనిని కూడా చదవండి : Iran US Tensions | భారీ సైన్యాన్ని దించిన అమెరికా.. “నరకానికి స్వాగతం” అంటూ ఇరాన్ హెచ్చరిక.. తీవ్ర స్థాయికి యుద్ధం!
