అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran bridge attack | ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ (Israel) దళాలు విరుచుకుపడుతున్నాయి. అనేక కీలక లక్ష్యాలపై దాడులు చేస్తున్నాయి. తాజాగా ఇరాన్‌కు చెందిన అతిపెద్ద వంతెన పేల్చివేశాయి. పశ్చిమాసియాలోనే ఇది అతిపెద్ద వంతెనగా తెలుస్తోంది. కాగా. ఈ దాడిని దాడిని ఇరాన్ ధ్రువీకరించింది. ఇరాన్ పై అతి భీకర దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించిన గంటల్లోనే దాడులు జరగడం గమనార్హం.
Iran bridge attack | మరోసారి ట్రంప్ హెచ్చరికలు
ఇరాన్(Iran)లోని అతిపెద్ద వంతెనపై దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత.. అమెరికా (America) అధ్యక్షుడు ట్రంప్ శుక్రవారం ఇరాన్ ప్రభుత్వానికి మరోసారి హెచ్చరిక జారీ చేశారు. “ఇరాన్‌లో మిగిలిన లక్ష్యాలను నాశనం చేస్తాం. అమెరికా బలగాలు ఇంకా అసలు దాడులు ప్రారంభించలేదు” అని పేర్కొన్నారు. ఆ దేశంలోని మరిన్ని వంతెనలు, ఇంధన మౌలిక సదుపాయాలు, విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Iran bridge attack | అనేక సైనిక లక్ష్యాలు ధ్వంసం
నెల రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇరాన్‌లోని చాలా ప్రధాన సైనిక లక్ష్యాలు ధ్వంసమయ్యాయని ట్రంప్ అన్నారు. “ఇరాన్ కొత్త ప్రభుత్వ నాయకత్వానికి ఏం చేయాలో తెలుసు, దానిని వేగంగా చేయాలి” అని పేర్కొన్నారు.
Iran bridge attack | వంతెనపై దాడిలో 8 మంది మృతి!
టెహ్రాన్ సమీపంలోని బి1 వంతెన కూలిపోతున్న వీడియోను ట్రంప్ షేర్ చేశారు. “మరీ ఆలస్యం కాకముందే ఒక ఒప్పందం చేసుకోండి” అని ఇరాన్‌ను కోరుతూ ట్రంప్ (Trump) హెచ్చరిక జారీ చేసిన కొన్ని గంటలకే ఈ ఘటన జరగడం గమనార్హం. పశ్చిమ ఆసియాలోని అత్యంత ఎత్తయిన, ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఒకటైన ఈ వంతెన దాడుల్లో కూలిపోయింది.
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల తర్వాత కనీసం ఎనిమిది మంది పౌరులు మృతి చెందారని, మరో 95 మంది గాయపడ్డారని ఇరాన్ మీడియా తెలిపారు. ఈ దాడి “కరాజ్‌లోని బి1 వంతెన”ను లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు పేర్కొంది. దాడి కారణంగా చుట్టుపక్కల ప్రాంతంలో ప్రాణనష్టం జరిగింది. అలాగే పలువురు గాయపడ్డారు.
Earlier today, the B1 Bridge on the Karaj Northern Bypass in western Tehran, Iran was targeted in a U.S. and/or Israeli strike, amidst an uptempo in joint U.S.-Israeli strike operations, announced by U.S. President Donald J. Trump last night. pic.twitter.com/Gm0NA2RZOC
— OSINTdefender (@sentdefender) April 2, 2026
ఇది కూడా చదవండి..: Randy George Removal | ఉద్రిక్తతల మధ్య అమెరికా కీలక నిర్ణయం.. ఆర్మీ చీఫ్ జనరల్ రాండీ జార్జ్ తొలగింపు
