అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran Ceasefire Deal | ఇరాన్‌పై సైనిక దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ తో జరిగిన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
Iran Ceasefire Deal | ద్వైపాక్షిక కాల్పుల విరమణ
ఇరాన్ వెంటనే హోర్ముజ్ జలసంధిని తెరవడానికి అంగీకరిస్తే.. రెండు వారాల పాటు బాంబుదాడులు, సైనిక చర్యలను నిలిపివేయడానికి అమెరికా సిద్ధంగా ఉందన్నారు. పరస్పర అంగీకారంతో అమలయ్యే ద్వైపాక్షిక కాల్పుల విరమణ (Ceasefire)గా ఈ నిర్ణయాన్ని వర్ణించారు.
Iran Ceasefire Deal | శాంతి ఒప్పందం దిశగా చర్చలు
అమెరికా తన సైనిక లక్ష్యాలను ఇప్పటికే సాధించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్‌తో దీర్ఘకాలిక శాంతి ఒప్పందం దిశగా చర్చలు ముందుకు సాగుతున్నాయన్నారు. ఇరాన్ యొక్క 10 అంశాల ప్రతిపాదన చర్చలకు పునాది అని అన్నారు. గతంలోని వివాదాస్పద అంశాల్లో చాలా వరకు రెండు దేశాలు కూడా ఏకాభిప్రాయానికి వచ్చాయని వివరించారు.
ఈ రెండు వారాల విరామంలో తుది ఒప్పందాన్ని ఖరారు చేస్తామన్నారు. మధ్యప్రాచ్యంలో శాంతిని నెలకొల్పడమే అమెరికా లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Bushehr Nuclear Tension | బుషెహర్‌లో ఆందోళన వాతావరణం.. అణు కేంద్రం సమీపంలో ఉద్రిక్తతలు
