అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran Ceasefire | అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ (Ceasefire)కు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సీజ్ఫైర్ కోసం అడుక్కుందన్నారు.
ఇరాన్‌పై మంగళవారం రాత్రి పెద్ద ఎత్తున దాడులు చేస్తామని ప్రకటించిన ట్రంప్ (Donald Trump) అనూహ్యంగా వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. ఇరాన్ ప్రతిపాదనలపై చర్చిస్తామని రెండు వారాల కాల్పుల విరమణకు ఆయన ఓకే చెప్పారు. ఈ క్రమంలో బుధవారం పీట్ హెగ్సెత్ (Pete Hegseth) మాట్లాడారు. ఇరాన్ డిఫెన్స్, ఇండస్ట్రియల్ బేస్‌లను కూల్చేశామన్నారు. ఇరాన్ ఇక క్షిపణులను తయారు చేసుకోలేదని పేర్కొన్నారు.
Iran Ceasefire | ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాం
ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశామని రక్షణ మంత్రి అన్నారు. వరుస భారీ దాడుల ద్వారా ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బతీశామని చెప్పారు. ఆ దేశం ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగి ఉండదని చెప్పారు. టెహ్రాన్ సాయంతో అణువ్యర్థాలు వెలికి తీసి తొలగిస్తామని తెలిపారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో వాషింగ్టన్ నిర్ణయాత్మక సైనిక విజయాన్ని సాధించిందన్నారు. మంగళవారం రాత్రి తాము 800 దాడులు నిర్వహించి, ఇరాన్ రక్షణ పారిశ్రామిక స్థావరాన్ని ధ్వంసం చేశామని చెప్పుకొచ్చారు. తమ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ గాయపడ్డారని హెగ్సెత్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి : Trump Iran Ceasefire | ప్రపంచ శాంతికి గొప్ప రోజు.. సీజ్‌ఫైర్‌పై ట్రంప్
