అక్షరటుడే, వెబ్‌డెస్క్: Iran Downs US Jets | పశ్చిమాసియాలో యుద్ధం రోజు రోజుకు తీవ్రం అవుతోంది. ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్‌లోని భారీ వంతెనపై శుక్రవారం ఇజ్రాయెల్ దాడి చేసింది. మరోవైపు టెహ్రాన్ సైతం ప్రతిదాడులను కొనసాగిస్తోంది. తాజాగా అమెరికా యుద్ధ విమానాల (American Fighter Jets)ను ఇరాన్ కూల్చి వేసింది.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరింత ఉధృతంగా మారుతోంది. అమెరికా యుద్ధవిమానాలను ఇరాన్ కూల్చేస్తోంది. గంటల వ్యవధిలోనే F–15, A-10 వార్ థగ్, F-35 విమానాలను కూల్చి వేసింది. ఒకే రోజులో రెండు అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేయడం, ఇరాన్ (Iran)తో దాదాపు ఐదు వారాలుగా సాగుతున్న ఘర్షణను కుదిపేసింది. ఈ ఘటనలో ఒక పైలెట్ సురక్షితంగా బయటపడగా.. మరో పైలెట్ ఆచూకీ తెలియరాలేదు. అమెరికా, ఇరాన్ దేశాలు ఈ వార్తను ధ్రువీకరించాయి.
Iran Downs US Jets | యుద్ధం ముగుస్తుంది
యుద్ధ విమానాల కూల్చివేతల పరిణామం చర్చలకు ఆటంకం కాదని ట్రంప్ (Donald Trump) పేర్కొన్నారు. మరికొన్ని వారాల్లో యుద్ధం ముగియనుందని తెలిపారు. అమెరికా యుద్ధంలో ఉందన్నారు. కాగా యుద్ధం ప్రారంభం అయిన నాటి నుంచి ఇరాన్ పలు అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేయడం గమనార్హం. అత్యాధునిక అమెరికన్ ఫైటర్ జెట్స్‌ను ఇరాన్ కూల్చడంతో రక్షణ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Iran Downs US Jets | ఎఫ్-16 విమానం అత్యవసరంగా ల్యాండ్
ఇరాన్ గగనతలంపై ఒక ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ విమానాన్ని కూల్చి వేసింది. రెండు ఏ-10 వార్‌హాగ్ విమానాలు దెబ్బతిన్నాయి. మరోచోట ఒక ఎఫ్-16 విమానం అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. కాగా యుద్ధ విమానం కూలిపోవడంతో పైలెట్‌లో కోసం రెండు అమెరికా బ్లాక్‌హాక్ హెలికాప్టర్లు గాలింపు చర్యలు చేపట్టాయి. వాటిపై సైతం ఇరాన్ కాల్పులు జరిపింది. మరోవైపు సౌదీ, కువైట్, యూఏఈలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగిస్తోంది.
ఇది కూడా చదవండి..: Trump Pharma Tariffs | డొనాల్డ్ టారిఫ్ ట్రంప్!.. మళ్లీ సుంకాలతో భయపెడుతున్న యూఎస్ ప్రెసిడెంట్
